Sunday, May 28, 2023

Big Breaking : కలెక్టరేట్‌ ‌భవనమెక్కి రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం..

జనగామ : రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యం.. అక్రమ పట్టాలు చేయడం వల్ల పలుమార్లు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో మొరపెట్టుకొని దరఖాస్తు చేసుకున్నా ఫలితం శూన్యం.. దీంతో సోమవారం జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్ర‌జావాణి జ‌రుగ‌గా.. త‌మ‌కు న్యాయం చేయాల‌ని బాధిత రైతులు క‌లెర్ట‌రేట్ భవనమెక్కి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల నరసింహ, నిమ్మల రేవతి దంపతులకు వారసత్వంగా వచ్చిన నాలుగు ఎకరాల భూమిని రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో వేరే వారికి పట్టా చశారు. దీంతో రెండు సంవత్సరాలుగా అర్జీలు పెట్టుకున్న ఫలితం లేక‌పోవ‌డంతో త‌మ‌కు ఆత్మహత్యనే శ‌ర‌ణ్యం అని, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల మనస్థాపానికి గురై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యత్వానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు, సంబంధిత అధికారులు బాధిత కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement