Monday, April 29, 2024

60th Match : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న RCB

జైపూర్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ర్సెస్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య 60వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేఆఫ్స్‌ రేసులోకి వచ్చింది.
మరోవైపు రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి కూడా రాజస్థాన్‌కు భిన్నంగా ఏమీ లేదు.

ప్రస్తుతం రాజస్థాన్‌ 12 పాయింట్లతో ఐదో స్థానంలో.. 10 పాయింట్లతో ఏడో స్థానంలో బెంగళూరు కొనసాగుతున్నాయి. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆర్‌సీబీకి ప్లేఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో జైపుర్‌ వేదికగా రాజస్థాన్‌, బెంగళూరు జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. దూకుడుగా ఆడుతున్న యశస్విను అడ్డుకోవడం ఆర్‌సీబీ బౌలర్లకు సవాల్‌తో కూడుకున్నదే. ఆరెంజ్‌ క్యాప్‌ కోసం ఫాఫ్‌ డుప్లెసిస్‌తో యశస్వి పోటీపడుతున్నాడు. ఫాఫ్‌ 576 పరుగులతో ఉండగా.. యశస్వి 575 పరుగులతో కొనసాగుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement