Sunday, June 23, 2024

స్మశానంలో ఉంటున్న 50 మంది….ఎందుకో తెలుసా ?

తెలుగు రాష్ట్రాలలో కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రతిరోజు ఎన్నోకొన్ని కేసులు బయటపడుతూనే ఉన్నాయి. సాధారణంగా కరోనా బారిన పడేవారు ఐసోలేషన్ కేంద్రాలకు వెళ్లి అక్కడే ఉంటారు. గ్రామాల్లో అయితే కరోనా బారిన పడిన వ్యక్తులు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలంలోని మొద్దులమడ గిరిజన గ్రామానికి చెందిన 50 మందికి కరోనా సోకింది. ఆ గ్రామ జనాభా మొత్తం 150 మంది కాగా… అందులో 50 మందికి కరోనా సోకడంతో ఆ కరోనా సోకిన వారంతా గ్రామాన్ని వదిలి స్మశానం లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

గ్రామంలో ఉన్న మిగతా వారు అలాగే పిల్లలు ఈ మహమ్మారి బారిన పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని వారంతా చెబుతున్నారు. అక్కడే కూడా వంటావార్పు తీసుకుని తింటున్నారు. తగ్గిన తరువాత గ్రామంలోకి వస్తామని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement