Friday, March 29, 2024

వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ ఉందా

మారీచ మాయా జింకను శ్రీరాముడు సం#హరించ గానే, వాడు చనిపోతూ, రాముడి గొంతుతో అరవ డంతో భ్రమించిన సీతాదేవి అన్నకు సహా యంగా మరది లక్ష్మణుడిని పొమ్మని బలవంతం చేస్తుంది. పోకపోతే నిష్టూరాలు ఆడింది. నిందించింది. ఆమె మాట కాదనలేక, అయిష్టంగానే లక్ష్మణుడు అన్నకు సాయంగా వెళ్తాడు. వెళ్తూ- వెళ్తూ కేవలం ఆమెను జాగ్రత్తగా వుండమని మాత్రమే అన్నా డు కాని ఇతర రామాయణాల్లో చెప్పినట్లు ఎలాంటి రేఖా (లక్ష్మణ రేఖ) గీయలేదు. ఆమెను ఫలానా హద్దులోనే వుండ మని, గీత దాటవద్దనీ నిర్దేశించనూ లేదు.
లక్ష్మణుడు అలా పోగానే, బిక్షాపాత్ర, కమండలాలు ధరిం చి, బ్రాహ్మణ సన్న్యాసి వేషంలో వచ్చిన (రావణాసురుడు) రాక్షసుడిని, తనకు కీడుచేసే ఆలోచనలో వున్నవాడిని, రాక్షసు డని తెలిసీ, బ్రాహ్మణుడిని పూజించిన విధంగానే పూజించింది సీతాదేవి. ”ఇదిగో దర్భాసనం.. ఇక్కడ కూర్చో. ఇదిగో అర్ఘ్యం… ఇదిగో బాద్యం… సర్వం సిద్ధం. ఇదిగో నీ ఆహారం కొరకు అడవి లోని పండ్లు… తృప్తిగా భుజించు” అని శాస్త్ర ప్రకారం చెప్తున్న సీతను, రాముడి భార్యను, తన చావు కొరకు రావణుడు బలా త్కారంగా అపహరించాలనుకున్నాడు. మాయా మృగాన్ని వేటాడడానికి పోయిన రామచంద్రుడు లక్ష్మణుడితో కలిసి వస్తాడేమోనని భయంగా అడవి నాలుగు దిక్కులా చూశాడు.
తనను బలాత్కారంగా తీసుకుపోదలచి రావణుడు అలా ప్రశ్నించాడని సీత భావించింది. అతిథులను, అభ్యాగతులను ఆదరించాల్సిన విధానం చక్కగా తెలిసిన సీత, రావణుడి మాటలు, వాడి ఆర్భాటం విని, చూసి, వీడు నిజమైన సన్న్యాసి కాదనుకుంటుంది. సన్న్యాసి వేషం ధరించిన బ్రాహ్మణుడు అనుకుని, అతిథితో అబద్ధం ఆడకూడదని, బ్రాహ్మణుడితో అసత్యం ఆడరాదని, అనుకుంటుంది. వీడు దొంగ సన్న్యాసి కాబట్టి వంచకులకు వంచనతో సమాధానం చెప్పాలి అనీ, అలా చెప్పడం దోషం కాదనీ, అల్ప కాలం ఆలోచన చేసి వాడికి లా చెప్పడం ప్రారంభించింది.
”మిథిలా రాజు, జనకరాజు కూతుర్ని. నా పేరు సీత అం టారు. నీకు మేలు కలగాలి. నేను శ్రీరాముడి భార్యను సుమా! మా మామగారు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని ఆలోచన చేశాడు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు. అప్పుడాయన భార్య కైక, నా భర్త దేశాన్ని వదిలిపోవాలని, తన కొడుకు రాజ్యా నికి పట్టాభిషిక్తుడు కావాలని, రెండు వరాలు తన భర్తను కోరిం ది. తన మాట అంగీకరించకపోతే ప్రాణాలు విడుస్తానని బెది రించింది. నా మామగారు ఆమెను ఎంత ప్రార్థించినా ఆయన విన్నపం చెవిన పెట్టలేదు. ఆ పట్టాభిషేక విఘ్నకాలానికి నా భర్తకు ఇరవై అయిదు సంవత్సరాల వయసు. నాకు పద్దెనిమి దేళ్ల వయసు. ఇంత లేత వయసు వారు అడవుల్లో ఎలా తిరగ గలరో కూడా మా అత్త కైకేయి ఆలోచించలేదు. తండ్రిని సత్య వచనుడిని చేయడానికి, దేనికీ భయపడని రాముడు, అరణ్యా లకు వచ్చాడు.”
రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితో అరణ్యానికి పోయేట ప్పుడు ఆయన వయసు పన్నెండేళ్ళు. ఆ సంవత్సరమే సీతా వివాహం. తరువాత పన్నెండేళ్ళు అయోధ్యలో సుఖంగా వున్నాడు. ఆ తరువాత సంవత్సరం పట్టాభిషేక ప్రయత్నం కాబట్టి అప్పటికి రాముడికి పాతిక సంవత్సరాలు. అరణ్య వాసం ఆరంభమైన తరువాత ఋష్యాశ్రమాలలో పదేళ్లు గడి పాడు. పంచవటిలో మూడేళ్లు వున్నాడు. వనవాసారంభం మొదలుపెట్టి ఇప్పటికి పధ్నాలుగవ సంవత్సరం కాబట్టి, సీతా పహరణ సమయానికి శ్రీరాముడికి ముప్పై ఎనిమిదవ ఏడు. సీత జనకుడికి దొరికింది మొదలు ఆరు సంవత్సరాలు మిథిల లో వుంది. వివాహం తరువాత అయోధ్యలో పన్నెండేళ్ళు వుంది. పదమూడో సంవత్సరం అరణ్యాలకు ప్రయాణంకాగా, వనవాసానికి బయల్దేరే సమయానికి సీతాదేవికి పద్దెనిమిది సంవత్సరాలు గడిచాయి. కాబట్టి, ఇప్పటికి సీతకు, ముప్పై ఒక్క ఏళ్లు గడిచాయి. ఇది ముప్పై రెండో ఏడు”.
సీత రావణుడికి ఇంకా ఇలా చెప్పింది. ”నా భర్త సవతి తమ్ముడు, శూరుడు, లక్ష్మణుడు అన్నకు సహాయంగా విల్లు- బాణాలు ధరించి మాతో అడవులకు వచ్చాడు. కైక కారణాన రాజ్యాన్ని పోగొట్టుకుని మేం ముగ్గురం అడవుల్లో తిరుగుతు న్నాం. కొంచెంసేపు నువ్వు ఇక్కడ వుంటే నా భర్త వస్తాడు. నీకు వనఫలాలు ఇస్తాడు. బ్రా#హ్మణుడా! నీ పేరేంటి? నీ గోత్రం ఏమి టి? నువ్వే కులం వాడివి? ఏ జాతివాడివి? వివరంగా చెప్పు. ఎక్కడైనా ఆశ్రమంలో వుండకుండా ఈ అరణ్యాలలో ఎందు కు తిరుగుతున్నావు?”
సీతాదేవి ప్రశ్నలకు ఆ రాక్షసుడు తన చరిత్ర చెప్తా వినమని అంటూ, పరుషంగా మాట్లాడాడు. తన పేరు వింటే దేవతలు, దైత్యులు కూడ గడగడలాడుతారని తన ప్రతిష్టను చెప్పుకు న్నాడు రావణుడు సీతతో ఇలా. ”ఎవని పేరు చెప్తే మనుష్యులు మాత్రమే కాకుండా దేవతలు, దైత్యులు కూడా గడ, గడలాడు తారో, అలాంటివాడిని, రాక్షసుల నాయకుడిని, నా పేరు రావ ణాసురుడు. నీకు మేలు కలుగుగాక. నిన్ను చూసింది మొదలు నా భార్యల మీద ప్రేమ కలగడం లేదు. ఉత్తమ స్త్రీలనెందరినో బలాత్కారంగా తెచ్చాను. అట్లా అయితే నువ్వెందుకు అని అడు గుతావేమో? వారందరికీ నువ్వు ప్రభ్వివై వుండు. నా గృ#హం లవణ సముద్రం మధ్యలో కొండ శిఖరం మీద వుంది. దాన్ని లంక అంటారు. అక్కడికి వచ్చి నాతో కలిసి వుండు. నువ్వు నా భార్యవైతివా సమస్తాభరణాలతో అలంకరించబడిన ఐదువేల మంది ఉత్తమ వంశంలో పుట్టిన స్త్రీలు శ్రద్ధాభక్తులతో నిన్ను సేవిస్తారు.”
రావణుడిలా చెప్పగా, అంతవరకూ వాడికి చేస్తున్న ఉప చారాలను వదిలి, సీతాదేవి అమితమైన కోపంతో, రాక్షసులకు ప్రభువైనా రావణుడిని లెక్కచేయకుండా, గట్టి మనస్సుతో జవాబిస్తూ తన భర్త శ్రీరాముడు ఎలాంటి వాడో, అతడి జోలికి వస్తే ఏ గతి పట్తుందో వివరించింది. గట్టి మనస్సుతో కఠినమైన మాటలు అన్నప్పటికీ భయంతో, భీకరమైన గాలికి వణికే అర టి చెట్టులాగా గడ-గడ వణికింది. అది చూసి సీతను మరింతగా భయపెట్టుతూ, రావణాసు రుడు తన కులం, బలం వర్ణిం చాడు.
(మిగతా రేపటి సంచికలో)

– వనం జ్వాలా నరసింహారావు
8008137012

Advertisement

తాజా వార్తలు

Advertisement