Sunday, April 28, 2024

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు…కొత్తగా 3308

తెలంగాణ లో కరోనా కేసులు అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి.ఇక రాష్ట్రంలో కొత్తగా 3,308 కరోనా కేసులు
నిర్ధారణ అయ్యాయి. అలాగే మరో 21 మంది కరోనా తో మృతి చెందారు. ఇక తాజా గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నమోదు అయిన కేసుల సంఖ్య 5,51,035కి చేరింది. అలాగే ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా దెబ్బకు 3,106 మంది మృతి చెందారు. ఇక కొత్తగా 4,723 మంది కరోనా నుంచి కోలుకోగా..మొత్తం ఆ సంఖ్య 5,04,970కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 42,959 యాక్టివ్ కేసులున్నాయి.

అలాగే గ్రేటర్ హైదరాబాద్ లో గడిచిన 24 గంటల్లో 513
కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు 1,24,509 కరోనా కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement