Thursday, March 28, 2024

మెగాపవర్ స్టార్ తో త్రివిక్రమ్ భారీ ప్రాజెక్టు ?

తెలుగు ప్రేక్షకులకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. గతేడాది అలా వైకుంఠపురములో సినిమా సూపర్ డూపర్ హిట్ ని అందుకున్న త్రివిక్రమ్… ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు. మొదట ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. వెంటనే మహేష్ తో సినిమా ఓకే చేసాడు త్రివిక్రమ్.

అయితే ఈ సినిమా తరువాత మరో భారీ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. అది కూడా మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోనట. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని కూడా రెడీగా పెట్టుకున్నాడట. ఫ్యాన్స్ కూడా ఎప్పటినుంచో ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు అయిన తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement