Thursday, March 28, 2024

ఆనందయ్య మందు…. నాటు మందు మాత్రమే – ఏపీ ఆయుష్ పరిశీలన విభాగం

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు పై ఆయుష్ విభాగం పరిశీలలో ఆ బృందం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య ‌మందుతో రోగులలో ఆక్సిజన్ పెరిగినట్లు ప్రాథమికంగా సమాచారం ఉందని ఆయుష్ కమిషనర్ రాములు స్పష్టం చేశారు.మా సమక్షంలో ఆనందయ్య మందు తయారు చేయగా.. అందులో ఎటువంటి హానికర పదార్ధాలు లేవని…. అయితే ఆనందయ్య ఇచ్చేది అయిర్వేదం కాదని.. నాటు మందుగా మాత్రమే పరిగణిస్తామని రాములు అన్నారు. కళ్లలో వేసే డ్రాప్స్ లో కూడా సాధారణ పదార్థాలే వాడుతున్నారని.. కాబట్టి మందు హానికరం కాదనే నిర్ణయానికి వచ్చినట్లు రాములు అన్నారు.

కాగా ఈ మందు రోగులపై పని చేస్తుందా లేదా అనేది మాత్రం విజయవాడ,తిరుపతి ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చుతుందని చెప్పారు. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ సంస్థకు ఆ డాక్టర్ల బృందం నివేదిక పంపుతుందని తెలిపారు. మొత్తంగా అన్ని నివేదికలు వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీ పై నిర్ణయం తీసుకుంటుందని రాములు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement