Thursday, April 25, 2024

ఈఎస్ఐ మెడి్సిన్స్ లో 200 కోట్ల డీలింగ్స్.. తేల్చేసిన ఈడీ ఆఫీసర్లు..

హైదరాబాద్‌, ప్రభ‌న్యూస్: ఈఎస్‌ఐ ఔషధాల కొనుగోళ్లలో 2015 నుంచి 2019వరకు దాదాపు రూ.200 కోట్ల అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) తేల్చింది. నిందితులు కూడబెట్టుకున్న అక్రమాస్తుల్లో ఇప్పటివరకు తెలంగాణ ఏపీ, బెంగళూరు, నోయిడాలో 131 స్థిరాస్తులను గుర్తించినట్లు తెలిపింది. వాటిలో 97 ప్లాట్లు, ఆరు విల్లాలు, 19 వాణిజ్య సముదాయాలు, ఆరు వ్యవసాయ భూములు, 4 ప్లాట్లు ఉన్నాయని పేర్కొంది. సెక్యూరిటీలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వంటి చరాస్తులు కూడా ఉన్నాయని ఈడీ తెలిపింది.

దేవికారాణికి చెందిన రూ.17.26 కోట్ల విలువైన ఆస్తులు, నాగలక్ష్మికి చెందిన రూ.2.45 కోట్ల ఆస్తులు, పద్మకు చెందిన రూ.74.08 లక్షల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఓమ్ని గ్రూప్‌ డైరెక్టర్‌ కే.శ్రీహరిబాబుకు చెందిన రూ.119.89 కోట్లు, పందిరి రాజేశ్వర్‌రెడ్డికి చెందిన రూ.7.07 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలిక జప్తు చేసింది. కేసులో మరికొందరు అనుమానితుల మనీలాండరింగ్‌ ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement