Sunday, May 9, 2021

ఏపీని దేవుడే కాపాడాలి… 24 గంటల్లో 20వేల కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ప్రతి రోజూ కొత్తగా వేల సంఖ్యలో కేసులునమోదవుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో 19,412 కొత్తగా కరోనా కేసులునమోదయ్యాయి. మొత్తం 98,214 శాంపిల్స్ ను పరీక్షించగా ఈ కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్తగా 61 మంది మృతిచెందారు. విజయనగరంలో ఎనిమిది మంది, విశాఖపట్నంలో ఏడుగురు, చిత్తూరులో ఏడుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఏడుగురు, అనంతపురం జిల్లాలో ఆరుగురు, ప్రకాశం జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, గుంటూరులో ఇద్దరు, శ్రీకాకుళం లో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఒకరు మృతి చెందారు.

అలాగే గడచిన 24 గంటల్లో 11579 మంది కరోనా నుండి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ కేసులు…1121102
యాక్టీవ్ కేసులు…130752
డిశ్చార్జ్ అయిన వారు…982297
మొత్తం మృతులు….8053

Advertisement

తాజా వార్తలు

Prabha News