Saturday, March 25, 2023

ఇదే మా కథ సెన్సార్ పూర్తి

సీనియర్ హీరో శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక చావ్లా ప్రధానపాత్రలో గురు పవన్ దర్శకత్వం వహించిన చిత్రం ఇదే మా కథ. మహేష్ గొల్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. 2021 మార్చి 19న థియేటర్స్ లో ఈ చిత్రాన్ని మొదట విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. కానీ కరోనా కారణంగా కుదరలేదు.

- Advertisement -
   

ఇక ఈ సినిమా టాలీవుడ్ లోనే మొదటి రోడ్డు అడ్వెంచర్ గా తెరకెక్కుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ u సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. కాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement