Saturday, April 27, 2024

తెలంగాణలో కొత్తగా 1771కరోనా కేసులు @టుడే అప్డేట్

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1771 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,20,525 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. ఈ కేసులు నమోదు అయ్యాయి. మ‌రో వైపు 13 మంది కరోనా బారిన‌ప‌డి మృతి చెందారు.

అలాగే గడిచిన 24 గంటల్లో 2384 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,02,089 కి చేరింది.. అలాగే డిశ్చార్జ్ అయిన కేసులు సంఖ్య 5,76,487 కి పెరిగాయి.అంతే కాకుండా ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో కరోనా బారిన‌ప‌డి 3,469 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 22,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement