Tuesday, May 7, 2024

స్టేడియంలో తొక్కిసలాట – 13 మంది మృత్యువాత

అంటననారివో: ద్వీప దేశమైన మడగాస్కర్‌లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ రాజధాని అంటననారివోలో క్రీడల పోటీల సందర్భంగా స్టేడియంలో తొక్కిసలాట జరిగి 13 మంది చనిపోయారు.. సుమారు 80 మంది గాయపడ్డట్లు ఆ దేశ ప్రధాని క్రిస్టియన్‌ ఎన్ట్సే తెలిపారు. 11వ ‘ఇండియన్‌ ఓసియన్‌ క్రీడల’ పోటీలను అంటననారివోలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 50,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. దీంతో స్టేడియం ముఖద్వారం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది.దీంతో పదుల సంఖ్యలో కింద పడి గాయాలపాలయ్యారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఒకరికొకరు తోసుకోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని మడగాస్కర్‌ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా తెలిపారు

. గత 40 ఏళ్లుగా నైరుతి హిందూ మహాసముద్ర దీవుల మధ్య పలు విభాగాల్లో క్రీడల పోటీలను నిర్వహిస్తున్నారు.నాలుగేళ్లకోసారి జరిగే ఈ పోటీలను ఈసారి ఈ మడగాస్కర్‌లో నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌ 3 వరకు ఇవి జరగనున్నాయి. గతసారి ఈ పోటీలు మారిషస్‌లో నిర్వహించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement