Monday, May 6, 2024

దేశంలో 13 లక్షల విద్యుత్‌ వాహనాలు..

దేశంలో ప్రస్తుతం 13 లక్షలకు పైగా ఎలక్ట్రికల్‌ వాహనాలు రిజిస్టర్‌ అయ్యాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, లక్షదీప్‌లకు చెందిన వివరాలు లేవని ఆయన చెప్పారు. ఈ రాష్ట్రాల నుంచి డేటా వాహన్‌ 4లో అందుబాటులో లేదని రాజ్యసభలో ఆయన బుధవారం నాడు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో తెలిపారు. ఫేమ్‌ ఫేజ్‌ 2 కింద ఇప్పటికే 2,877 పబ్లిక్‌ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ ఛార్జింగ్‌ స్టేషన్లు దేశవ్యాప్తంగా 68 నగరాల్లో ఏర్పాటైనట్లు పేర్కొన్నారు.

1476 ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు 9 ఎక్స్‌ప్రెస్‌ హైవేస్‌, 16 హైవేస్‌ల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాహన్‌ 4లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం దేశంలో ఈ నెల 14 నాటికి 13,34,385 విద్యుత్‌ వాహనాల రిజిస్టర్‌ అయ్యాయని వివరించారు. ప్రపంచంలోని 207 దేశాల్లో ఉన్న మొత్తం వాహనాలు 2,05,81,09,486 ఉంటే అందులో 13.4 శాతం అంటే 27,25,87,170 వాహనాలు మన దేశంలోనే ఉన్నాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా 207 దేశాల్లో చూస్తేత మన దేశంలోనే 26.37 శాతం మంది అంటే 1.5 లక్షల మంది చనిపోతున్నారని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement