Saturday, April 27, 2024

యాడ్ లో బాలయ్య..వీడియో రిలీజ్..అదిరిన లుక్

సినీ నటుల్లో కొంతమంది యాడ్స్ కి దూరంగా ఉంటారు. అలాంటి వారిలో ముందుంటారు నందమూరి బాలకృష్ణ. ఓవైపు వెండితెరపై..మరోవైపు బుల్లితెరపై ప్రేక్షకులను నాన్ స్టాప్ గా అలరిస్తూ అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తున్నాడు బాలయ్య. తాజాగా ఆయన అడ్వర్టైజింగ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అధికారిక అప్‌డేట్‌ వచ్చింది. బాలకృష్ణ తొలి కమర్షియల్‌ యాడ్‌ వీడియో వచ్చేసింది. లీడింగ్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ సాయిప్రియ గ్రూపునకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు బాలకృష్ణ. ఈ టాలెంటెడ్‌ హీరో సినిమాటిక్‌ స్టైల్‌లో 116 పారామౌంట్‌ వెంచర్‌ ను ప్రమోట్‌ చేస్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది.ఈ వీడియో బాలయ్య లుక్ అదిరిపోయింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement