Sunday, May 5, 2024

10మిలియ‌న్ వ్యూస్ ద‌క్కించుకున్న ‘ఖిలాడీ’ చిత్రంలోని సాంగ్..

ఈ మ‌ధ్య‌కాలంలో రిలీజ్ కానున్న చిత్రాల‌లోని పాట‌లు రికార్డ్స్ ని సృష్టిస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు చిత్రాల్లోని పాట‌లు రికార్డ్స్ నెల‌కొల్ప‌గా ..రీసెంట్ గా మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ న‌టిస్తోన్న ఖిలాడీ చిత్రంలోని పాట 10మిలియ‌న్ వ్యూస్ ని ట‌చ్ చేసింది. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ర‌మేశ్ వ‌ర్మ‌. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఆయన స్వరపరిచిన 'ఇష్టం .. ' అనే లిరికల్ సాంగ్ కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేశారు. ఆ సాంగ్ 10 మిలియన్ వ్యూస్ మార్క్ ను టచ్ చేసింది. దాంతో మేకర్స్ అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

భారీ బడ్జెట్ తో .. బలమైన తారాగణంతో ఈ సినిమా నిర్మితమైంది. అర్జున్ .. ముఖేశ్ రుషి .. సచిన్ కేడ్కర్ .. రావు రమేశ్ .. ఉన్నిముకుందన్ .. మురళీశర్మ .. అనసూయ భరద్వాజ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి విడుదల తేదీ ప్రకటన రానుంది. ర‌వితేజ‌ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి – డింపుల్ హయతి అందాల సందడి చేయనున్నారు. ఈ సినిమాతోనే మీనాక్షి చౌదరి తెలుగు తెరకి పరిచయమవుతోంది. పెన్ స్టూడియోస్ – ఎ స్టూడియోస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement