Wednesday, May 8, 2024

టాప్‌ 10 కంపెనీల ఎం క్యాప్‌లో 1.32 లక్షల కోట్ల క్షీణత.. 43వేల కోట్లతో రిలయన్స్‌ టాప్‌..

దేశీయ స్టాక్‌ మార్కెట్స్‌లో.. టాప్‌ 10లోని ఏడు కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ గత వారం రూ.1.32 లక్షల కోట్లు క్షీణించింది. టాప్‌ టెన్‌లో మార్కెట్‌ క్యాప్‌ పరంగా టాప్‌ వన్‌లోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీగా నష్టపోయింది. గత వారం సెన్సెక్స్‌ 1,108.25 పాయింట్లు (1.86 శాతం) క్షీణించింది. రియలన్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ నష్టాల్లో ముగియగా.. కేవలం ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, ఎస్‌బీఐ మాత్రమే లాభాల్లో ముగిశాయి.

రూ.27వేల కోట్లు కోల్పోయిన ఇన్ఫీ..

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.43,491.37 కోట్లు క్షీణించి.. రూ.17,26,714.05 కోట్లకు తగ్గింది. ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.27,953.78 కోట్లు తగ్గి.. రూ.7,35,611.35 కోట్లకు పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్‌ క్యాప్‌ రూ.27,866.34 కోట్లు క్షీణించి.. రూ.8,12,338.57 కోట్లుగా నమోదైంది. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్‌ క్యాప్‌ రూ.14,631.11 కోట్లు తగ్గి.. రూ.4,31,028.49 కోట్లకు పడిపోయింది. టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.9,348.88 కోట్లు క్షీణించి.. రూ.13,39,688.48 కోట్లుగా నమోదైంది. హిందుస్థాన్‌ యూనిలీవర్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.7,119.26 కోట్లు క్షీణించి.. రూ.5,05,737.77 కోట్లుగా నమోదైంది. బజాజ్‌ ఫైనాన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.2,125.05 కోట్లు క్షీణించి.. రూ.2,125.05 కోట్లుగా నమోదైంది.

అదానీ టాప్‌ టెన్‌లోకి..

అదానీ గ్రీన్‌ ఎనర్జీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.84,581.99 కోట్లు పెరిగి.. రూ.4,48,050.99 కోట్లకు ఎగబాకింది. ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్‌ క్యాప్‌ రూ.5,559.02 కోట్లు ఎగిసి.. రూ.5,29,739.59 కోట్లుగా నమోదైంది. ఎస్‌బీఐ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1249.45 కోట్లు ఎగిసి.. రూ.4,61,848.65 కోట్లుగా నమోదైంది.

- Advertisement -

టాప్‌ టెన్‌ కంపెనీలు..

టాప్‌ టెన్‌ కంపెనీలు చూసుకుంటే.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ముందు వరుసలో ఉంది. ఆ తరువాత స్థానంలో టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement