Saturday, May 4, 2024

ఎల్‌ఐసీ ఐపీఓకు ఫెమా నిబంధనల సవరణ.. సంస్థలో ఎఫ్‌డీఐ వాటా తగ్గించేందుకు సర్కార్‌ కసరత్తు

విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలను ప్రభుత్వం సవరించింది. ఈ సవరణ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)లో 20 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) మార్గం లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ ఐపీఓ ద్వారా ఎల్‌ఐసీలో తన వాటాను తగ్గించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఎల్‌ఐసీ ఫిబ్రవరిలో సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ)కి ఐపీఓ కోసం పత్రాలను డీఆర్‌హెచ్‌పీ సమర్పించింది. గత నెలలో సెబీ ముసాయిదా పత్రాలను ఆమోదించింది. ఇప్పుడు బీమా కంపెనీ మార్పులతో ప్రతిపాదన కోసం అభ్యర్థన (ఆర్‌ఎఫ్‌పీ) దాఖలు ప్రక్రియలో ఉంది. కేంద్ర కేబినెట్‌ ఆమోదం పొందిన తరువాత.. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) మార్చి 14న ఎల్‌ఐసీ పెద్ద ఐపీఓకి ముందు కంపెనీలో విదేశీ పెట్టుబడులు తీసుకురావడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సవరించింది.

ఎల్‌ఐసీ విలువ రూ.5.4 లక్షల కోట్లు..

ఎఫ్‌డీఐ విధానంలో మార్పులతో డీపీఐఐటీ నిబంధనలను అమలు చేయడానికి ఫెమా నోటిఫికేషన్‌ అవసరం. ఈ నిబంధనలను ఫారెన్‌ ఎక్స్ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ (నాన్‌ డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌) (సవరణ) రూల్స్‌, 2022 అని పిలవచ్చని ఇటీవల విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ పేర్కొంది. నోటిఫికేషన్‌ ద్వారా ఇప్పటికే ఉన్న పాలసీలో ఒక పేరా చేర్చారు. దీనిలో ఆటోమేటిక్‌ రూట్‌లో ఎల్‌ఐసీలో 20 శాతం వరకు ఎఫ్‌డీఐ అనుమతించనున్నారు. ప్రస్తుత ఎఫ్‌డీఐ విధానం ప్రకారం.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 20 శాతం విదేశీ పెట్టుబడులకు ఈ సవరణ లైన్‌ క్లియర్‌ చేసింది. ఎల్‌ఐసీలో ప్రభుతం ఐదు శాతం వాటాను రూ.63,000 కోట్లకు విక్రయించేందుకు ముసాయిదా పత్రాలను సెబీ ఆమోదించింది. ముసాయిదా పత్రాల ప్రకారం.. 30 సెప్టెంబర్‌ 2021 నాటికి ఎల్‌ఐసీ విలువ దాదాపు రూ.5.4 లక్షల కోట్లుగా ఉంది. అంతర్జాతీయ వాల్యూమర్‌ మిల్లిమాన్‌ అడైజర్స్‌ ఎల్‌ఐసీ విలువను రూపొందించారు. ఎల్‌ఐసీ మార్కెట్‌ వ్యాల్యూయేషన్‌ను పత్రాల్లో వెల్లడించనప్పటికీ.. పరిశ్రమ ప్రమాణాల ప్రకారం.. ఇది విలువకు మూడు రెట్లు ఎక్కువ.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement