Saturday, April 27, 2024

హ్యాపీ బర్త్ డే సీఎం కేసీఆర్ – హైదరాబాద్ : కుల వృత్తులకు పూర్వ వైభవం

దాదాపు అంతరించిపోయే స్థాయికి చేరుకున్న కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చి చరిత్రలో నిలిచేలా ప్రోత్సహించిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావుదే. తెలంగాణ రాష్ట్రంలో  లక్షలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచారు. బంగారు తెలంగాణ సాధనకోసం ఎంచుకున్న లక్ష్యాలు భావితరాలకు ఆదర్శంగా ఉండేలా కేసీఆర్‌  ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఎల్లవే ళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధిని స్వయంగా పర్యవేక్షించేలా చేసి నూతన తరం రాజకీయాల్లో విశిష్ట నేతగా నిలిచారు. తెలంగాణ ప్రజల కష్టాలు స్వయంగా చూసిన సామాజిక వేత్తగా, గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు రాజకీయాలపై విశేష అనుభవం కలిగిన విశిష్ట రాజకీయ వేత్తగా కేసీఆర్‌ బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాదులు వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement