Friday, May 3, 2024

హ్యాపీ బర్త్ డే కేసీఆర్ – హైదరాబాద్ : ప్రతి నిర్ణయం వినూత్నం

ఏడేళ్ల కిందట తొలిసారి ముఖ్య మంత్రిగా బాధ్య తలు స్వీక రించిన తర్వాత ఉద్యమంలో కీలక భాగస్వా మ్యం పంచుకున్న ప్రభు త్వ ఉద్యోగుల డిమాం డ్లను నెరవేర్చి పరిపక్వత చెందిన పాలనాధినేతగా ప్రశంసలందుకున్నారు.  గోల్కొండ కోటలో ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించి తెలంగాణ పూర్వవై భవానికి బాటలు వేశారు. అభివృద్ధి, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూనే అన్ని రంగాల్లో ప్రక్షాళన చేపట్టి పురోగతికి చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేకతను, విశిష్టతను ప్రపంచం నలుమూలలా చాటేలా  కొత్త తరహాలో పరిపాలనను కొనసాగిస్తున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని చేపట్టి 31 జిల్లాలను వివాదరహితంగా ఏర్పాటు చేసి ఘనత దక్కించుకున్నారు. రాష్ట్రంలో ఉన్న కోటి మూడు లక్షల కుటుంబాల్లో నూతన వెలుగులు నింపాలన్న సంకల్పంతో ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు సామాజిక సర్వేను చేపట్టి రికార్డు సృష్టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement