Saturday, April 27, 2024

హైదరాబాద్ : దేశానికే దిక్సూచి…కేసీఆర్ పథకాలు…ఆలోచనలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా, తానంటే ఏమిటో నిరూపించుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొత్తతరం రాజకీయాలకు, పరిపాలనకు మార్గదర్శిగా నిలిచారు. గడిచిన ఐదేళ్ళలో అన్ని వర్గాల మెప్పు పొందే విధంగా అభివృద్ధి, సంక్షేమ రంగాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చి తద్వారా  దేశంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణాకు విశిష్ట గుర్తింపును తెచ్చిపెట్టారు.   సరికొత్త పథకాలతో సంక్షేమ రాష్ట్రంగా, వ్యవస్థీకృత మార్పులతో పరిపాలనా దక్షుడిగా రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలబెట్టారు. ప్రతిష్టాత్మక పథకాలు, చారిత్రాత్మక నిర్ణయాలతో అన్ని వర్గాల ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

ఎంచుకున్న ప్రతి కార్యక్రమంలోనూ కొన్ని దశాబ్దాల ముందుచూపుతో లక్ష్యాలను నిర్దేశించుకుని  విజయాలు సాధిస్తూ వస్తున్నారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్‌ వ్యవస్థీకరణ, గ్రామ పంచాయతీల పెంపు, కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, అడవుల సంరక్షణ, ఇంటింటికీ సురక్షిత తాగునీరు, రైతుబంధు పంట పెట్టుబడి, రైతు  బీమా, అమ్మఒడి లాంటి ఆయన ప్రారంభించిన పథకాలన్నీ దేశానికి ఆదర్శంగా, అవశ్యంగా మారాయనడంలో అతిశయోక్తి లేదు. గ్రామాల్లో పౌరసేవలను ప్రజలకు మరింత దగ్గరగా చేసి పరిపాలనా వ్యవస్థలో కొత్త పుంతలకు శ్రీకారం చుట్టిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుదే.

Advertisement

తాజా వార్తలు

Advertisement