Thursday, May 2, 2024

సీఎం పదవి చెపట్టి 26 ఏళ్లు..

నారా చంద్రబాబునాయుడు తొలిసారి సీఎంగా పదవి చేపట్టి 26 ఏళ్లు పూర్తయ్యాయి. 1 సెప్టెంబరు 1995న చంద్రబాబునాయుడు తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ అంగన్‌వాడీ వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఆధ్వర్యంలో చంద్రబాబుతో మహిళలు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు, పట్టాభిరామ్, పిల్లి మాణిక్యరావు, సయ్యద్ రఫీ, ఏవీ రమణ, గోనుగుంట్ల కోటేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: చోరికి గురైన బీర్ లోడ్ లారీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement