Monday, April 29, 2024

శ్రీకాకుళం : సిక్కోలు జిల్లాలో ప్రశాంతంగా తొలి విడత పంచాయతీ

శ్రీకాకుళం జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లాలోని లావేరు, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి, ఎల్.ఎన్.పేట, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం మండలాల్లో మంగళవారం ఉదయం 6.30గం.ల నుండి మధ్యాహ్నం 3.30గం.ల వరకు పోలింగ్ కొనసాగింది. 10 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో మధ్యాహ్నం 3.30గం.లకు 76.69 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లా కలెక్టర్ జె.నివాస్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్ధార్ క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికలను స్వయంగా పరిశీలించారు. లావేరు మండలంలోని లావేరు, కోటబొమ్మాళి మండలంలోని కోటబొమ్మాళి, కురుడు, సంతబొమ్మాళి మండలంలోని సంతబొమ్మాళి, రుంకు హనుమంతుపురం గ్రామాలతో పాటు పలు ప్రాంతాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను జిల్లా కలెక్టర్ ఎస్.పితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అదేవిధంగా ఎన్నికల పరిశీలకులు సిహెచ్.శ్రీధర్ నిమ్మాడ, ఎల్.ఎన్.పేట మండలం కరకవలస గ్రామ పంచాయతీలతో పాటు పలు గ్రామాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని స్వయంగా పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జిల్లా యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టడంతో తొలివిడత ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా ముగిసాయి. జిల్లాలోని 10 మండలాల్లో మధ్యాహ్నం 3.30గం.ల వరకు 76.69 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8.30గం.లకు 12.11 శాతం, 10.30గం.లకు 29.13 శాతం, మధ్యాహ్నం 12.30గం.లకు 54.57 శాతం, మధ్యాహ్నం 2.30గం.లకు 69.00 శాతం, మధ్యాహ్నం 3.30గం.లకు 76.69 శాతం పోలింగ్ నమోదైంది. మండలాల వారీ పోలింగ్ శాతం వివరాలు ఇలా…

Advertisement

తాజా వార్తలు

Advertisement