Wednesday, May 1, 2024

మత్తు వదిలేలా.. గుట్టు కదిలేలా

బయటపడిన గుట్కా స్థావరాలు
ఆంధ్రప్రభ కథనాలకు కదిలిన పోలీసు యంత్రాంగం
ఎస్పీ ఆధ్వర్యంలో వరుస దాడులు
పట్టుబడిన గుట్కా వ్యాపారులు
ఉమ్మడి జిల్లాలో పలువురిపై కేసు నవెూదు
నిషేధిత, మత్తు పదార్థాలు, గుట్కా వ్యాపారం చేస్తే కఠిన చర్యలు
మహబూబ్‌నగర్‌ ఎస్పీ


మహబూబ్‌ నగర్‌ బ్యూరో (ప్రభ న్యూస్‌):
అక్రమ గుట్కా వ్యాపారం, మత్తు పదార్థాల అమ్మకాలు కొన్నేళ్లుగా పాలమూరు జిల్లా పరువు తీస్తున్నాయి. ఆంధ్రప్రభ గత ఏడాది పాటుగా వరుసగా గుట్కా గుట్టు రట్టు చేసేలా వరుస కథనాలను ప్రచురించింది. నాడు స్పందించిన పోలీసు శాఖ పకడ్బందీ వ్యూహంతో కట్టడి చేసినా కథ మళ్లిd షురూ అయింది. మరోసారి మత్తు పదార్థాలు, గుట్కా గుట్టుపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించడంతో పాలమూరు ఉమ్మడి జిల్లాలో పోలీసులు దాడులు విస్తృతం చేశారు. మహబూబ్‌నగర్‌ పోలీస్‌ బాస్‌ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా జిల్లా కేంద్రంలోని నిషేధిత మత్తు పదార్థాలు, అక్రమ రవాణా, అమ్మకాలపై తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం జిల్లా కేంద్రంలో క్లాక్‌ టవర్‌ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాల రవాణా, వ్యాపారం చేస్తున్న వారిపై పెద్ద ఎత్తున టాస్క్‌ ఫోర్స్‌ బల గాలు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో నిషేధిత గుట్కా నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిషేధిత మత్తు పదార్థాలు, గుట్కా వ్యాపారాలు చేస్తే తీవ్రమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలీసులు దాడులు
దేవరకద్రలో.. జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు మండల కేంద్రంలో నిషేధిత గుట్కా విక్రయిస్తున్న దుకాణాలపై శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్‌ఐలు నరేష్‌, భగవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా దుకాణాలను తనిఖీలు చేశారు. పాత, కొత్త బస్టాండ్‌ సమీపంలో ఉన్న వ్యాపార దుకాణాలను పోలీసులు తనిఖీలు చేశారు. ఇందులో కోయిల్‌ సాగర్‌ వైపు వెళ్లే దారిలో రమేష్‌ అనే కిరాణం షా పు లో పెద్ద మొత్తంలో గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ జనార్దన్‌ గౌడ్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.
వంగూర్‌లో.. ఎస్పీ ఆదేశాల మేరకు వంగూర్‌ మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో శనివారం పోలీస్‌ బృందం అక్కడికి వెళ్లి కిరాణం షాపులను తనిఖీ చేయగా.. గుట్కా ప్యాకెట్లు- లభ్యం కావడంతో గోవర్ధన్‌ సలాం అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు- ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి మత్తు పదార్థాలను విక్రయించడం ద్వారా యువత వాటికి బానిసగా మారి పెడదోవ పట్టి అవకాశం ఉందని ఎస్‌ఐ తెలిపారు. అందుకు కిరాణం షాపుల వ్యాపారస్తులు ఇలాంటి పదార్థాలను విక్రయించకుండాజాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు లేనిపక్షంలో ఇలాంటి మత్తు పదార్థాలను విక్రయించే వారికి చట్టపరమైన చర్యలుతప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.
పదరలో.. అమ్రాబాద్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం పోలీసులు పదర మండల కేంద్రంలోని కిరాణా షాపులపై దాడులు నిర్వహించి , గుట్కాలను స్వాధీనం చేసుకొని, ముగ్గురు కిరాణా షాపు యజమానులపై నమోదు చేసినట్లు- అమ్రాబాద్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ ఆదిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల కొనుగోలు వాడకాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింద ని, ఎస్పీ ఆదేశాల మేరకు పదర మండల కేంద్రంలో కిరాణా షాపుల పై దాడులు నిర్వహించగా నిషేధిత గుట్కా లు లభ్యమైన ట్లు- ఆయన అన్నారు, వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన ఆయన తెలిపా రు ప్రభుత్వం, నిషేధించిన గుట్కాలను ఎవరు అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామ ని ఆదిరెడ్డి హెచ్చరించారు, ఈ కార్యక్రమం లో పోలీస్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement