Friday, May 3, 2024

బిజెపిలో చేరిన ప్రముఖ బెంగాల్ నటి

బిజెపిలో చేరారు ప్రముఖ బెంగాల్ నటి పాయెల్ సర్కార్. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఆమె బిజెపి తీర్థం స్వీకరించడం విశేషం. కోల్ కతా నగరంలోని బిజెపి కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో సినీ నటి పాయెల్ సర్కార్ బిజెపిలో చేరారామె. ఎన్నికల నేపథ్యంలో అంతకుముందు మరో సినీనటుడు యష్ దాస్ గుప్తా బీజేపీ ఇన్ చార్జి కైలాష్ విజయవర్గీయ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, రాజ్యసభ ఎంపీ స్వపన్ దాస్ గుప్తాల సమక్షంలో బీజేపీలో చేరారు.మరో వైపు క్రికెటర్ మనోజ్ తివారీ, మరో ముగ్గురు బెంగాల్ సినీ నటులు సీఎం మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సినీనటులు రాజ్ చక్రవర్తి, కంచన్ ముల్లిక్, సయోనీ ఘోష్ లు మమతాబెనర్జీ పార్టీలో చేరారు.పశ్చిమబెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలు త్వరలో ఖరారు కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement