Thursday, May 2, 2024

నిమ్మగడ్డకు హైకోర్టు మరో షాక్

అమరావతి: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పలు చోట్ల మళ్లీ నామినేషన్‌లకు అవకాశం కల్పిస్తూ నిమ్మగడ్డ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. గత ఏడాది మున్సిపల్ ఎన్నికల నామినేషన్‌లను పలుచోట్ల బలవంతంగా ఉపసంహరించారంటూ వివిధ పార్టీల నుంచి ఫిర్యాదులు అందడంతో స్పందించిన ఈసీ.. జిల్లా కలెక్టర్ల నివేదికల మేరకు మంగళవారం ఉ.11 గంటల నుంచి మధ్యాహ్పం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు.

అయితే నిమ్మగడ్డ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు SEC ఆదేశాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో SEC అవకాశం కల్పించిన 14 వార్డుల్లో ఏడు చోట్ల రీ నామినేషన్లు దాఖలు కాగా హైకోర్టు తీర్పు కారణంగా ఆ నామినేషన్లు రద్దయ్యాయి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కారణంగా వార్డు వాలంటీర్లు సెల్‌ఫోన్లు తిరిగి ఇచ్చేయాలన్న ఆదేశాలను హైకోర్టు కొట్టివేయగా.. తాజాగా రీ నామినేషన్ల ఆదేశాలను కోర్టు డిస్మిస్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement