Sunday, May 19, 2024

నాలుగో టెస్టులో కోహ్లీ చెత్త రికార్డు

ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో స్టోక్స్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండా ఔటైన అతడు.. టెస్ట్ కెరీర్‌లో మొత్తంగా 12వ సారి డకౌట్ అయ్యాడు. సారథిగా మాత్రం కోహ్లీకి ఇది 8వ డకౌట్. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కూడా టెస్టుల్లో సారథిగా 8 సార్లు డకౌట్ అయ్యాడు. దీంతో ధోనీ సరసన కోహ్లీ నిలిచాడు. మరోవైపు ఒకే టెస్టు సిరీస్‌లో కోహ్లీ రెండు సార్లు డకౌట్ కావడం అతడి కెరీర్‌లో ఇది రెండో సారి. ఓవరాల్‌గా భారత్ తరఫున టెస్టుల్లో ఇషాంత్ 32 సార్లు డకౌట్‌గా వెనుతిరిగి టాప్‌లో ఉన్నాడు. కాగా రెండో రోజు టీ సమయానికి భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. పంత్ (36), సుందర్ (1) క్రీజులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement