Monday, April 29, 2024

నల్గొండ : సీఎం సభకు భారీ ఏర్పాట్లు

నల్గొండ జిల్లా అనుముల మండలం అలీనగర్‌ సవిూపంలో బుధవారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి ధన్యవాద సభకు భారీ  ఏర్పాట్లు చేస్తున్నారు. సాగర్‌ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని సిఎం కెసిఆర్‌ సభనుప్రతిష్టాత్మకం తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు సాగర్ ఉప ఎన్నికకు  ముందస్తు ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. సబకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ పరిశీలించి, పర్యవేక్షించారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా 1,04,600 ఎకరాల టేలాండ్‌ భూములకు సాగునీరు అందించేందుకు రూ.3వేల కోట్లతో 13 ఎత్తిపోతల పథకాల ఏర్పాటుకు ఇటీవల అనుమతి ఇచ్చిన పనులకు  సీఎం కేసీఆర్‌ రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలకు ధన్యవాదాలు తెలిపేందుకు అలీనగర్‌ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 12 నియోజకవర్గాల నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా సమీకరించేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, లిఫ్టులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement