Monday, April 29, 2024

కాకినాడ : తూర్పులో ప్రశాంతంగా పంచాయతీ

తూర్పుగోదావ‌రి జిల్లా యంత్రాంగం మంచి ఏర్పాట్లు చేయ‌డంతో తొలివిడ‌త కాకినాడ‌, పెద్దాపురం డివిజ‌న్ల‌లో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా జ‌రుగుతున్న‌ట్లు పంచాయ‌తీ ఎన్నిక‌ల జిల్లా ప‌రిశీల‌కులు హెచ్‌.అరుణ్‌కుమార్ తెలిపారు. మంగ‌ళ‌వారం జ‌గ్గంపేట మండ‌లంలోని గొల్ల‌ల‌గుంట గ్రామంలో పోలింగ్ స‌ర‌ళిని అరుణ్‌కుమార్ ప‌రిశీలించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఎక్క‌డా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లకు తావులేకుండా ఎన్నిక‌ల ప్ర‌క్రియ స‌జావుగా సాగుతోంద‌ని పేర్కొన్నారు. ప‌ది రోజుల క్రితం దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న చోటుచేసుకున్న గొల్ల‌ల‌గుంట గ్రామంలో ఒంటి గంట స‌మ‌యానికే దాదాపు 90 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు తెలిపారు. ఇక్క‌డ చాలా ప్ర‌శాంతంగా పోలింగ్ జ‌రుగుతోంద‌న్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి రెండు డివిజ‌న్ల‌లోని హైప‌ర్ సెన్సిటివ్ గ్రామాల్లో ప‌ర్య‌టించిన‌ట్లు వెల్ల‌డించారు. కోవిడ్‌-19 నేప‌థ్యంలో పోలింగ్ ప్రాంతం, కేంద్రాల్లో థ‌ర్మ‌ల్ స్కాన‌ర్లు, శానిటైజ‌ర్లు, మాస్కులతో ప‌టిష్ట‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ ఓట‌ర్లు త‌మ ఓటు హక్కు వినియోగించుకుంటున్న‌ట్లు అరుణ్‌కుమార్ వివ‌రించారు.

తూర్పులో పోలింగ్ శాతాలు…

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పోలింగ్ శాతం
పిఠాపురం  84.5
గొల్లప్రోలు   82.06
యు కొత్తపల్లి 82.87

ప్రత్తిపాడు మండలంలో 78.93 % పోలింగ్ జరిగింది. గండేపల్లి మండలంలో పోలైన ఓట్లు శాతం 86.12

తుని మండలం లో 84.71 శాతం పోలైన ఓట్లు

- Advertisement -

శంఖవరం మండలంలో 77.80 శాతం ఓట్లు పోలయ్యాయి.

అత్యధికంగా వజ్రకూటం 94.67 అత్యల్పంగా అన్నవరం 66.79 శాతం పోలయ్యాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement