Saturday, April 27, 2024

దేశవ్యాప్తంగా కొత్తగా 15,388 మందికి కరోనా

భార‌త్‌లో గడిచిన 24 గంటల్లో 15,388 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ ఉదయం విడుదల చేసింది. ఇవాళ 16,596 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  1,12,44,786కు చేరింది. ఇక గడచిన 24 గంట‌ల సమయంలో 77 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,930కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,99,394 మంది కోలుకున్నారు. 1,87,462 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

ఇక తెలంగాణలో కొత్త‌గా 142 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 178 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,153కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,96,740 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,644 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,769 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 633 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 31 క‌రోనా కేసులు నమోద‌య్యాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement