Saturday, May 18, 2024

‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారాల్లో ‘అక్షయ్..దీపిక’

ఫిబ్రవరి 20న దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సినిమా, మ్యూజిక్, ఓటీటీలకు సంబంధించి అవార్డులను ప్రకటించారు. వాటిలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే..హీరో అక్షయ్ కుమార్, సుస్మితా సేన్, సురభి చంద, నోరా ఫతేహి వంటి సెలబ్రిటీలు అవార్డులను అందుకోవడం విశేషం.బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ల‌క్ష్మీ బాంబ్ చిత్రంతో ఉత్త‌మ న‌టుడు పుర‌స్కారం అందుకోగా, దీపిక ప‌దుకొణే ఛ‌పాక్ చిత్రానికి గాను ఉత్త‌మ క‌థానాయిక‌గా పుర‌స్కారం సొంతం చేసుకుంది. ఇక గ‌త ఏడాది అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించిన యువ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విమ‌ర్శ‌కులచే ప్ర‌శంస‌లు పొందిన న‌టుడిగా చిచోరే చిత్రానికి అత‌నిని జ్యూరీ ఎంపిక చేసింది. ఇక  కియారా అడ్వాణీ ‘గిల్టీ’ చిత్రంతో ‘విమర్శకులచే ప్ర‌శంస‌లు పొందిన‌ ఉత్తమ నటి’ విభాగంలో పురస్కారం సొంతం చేసుకుంది .ఉత్తమ చిత్రంగా తానాజీ (ది అన్‌సంగ్‌ వారియర్‌) నిలిచింది. ఉత్తమ దర్శకుడు : అనురాగ్‌ బసు (లుడో). ఉత్తమ సిరీస్‌ : స్కామ్‌ 1992, ఉత్తమ వెబ్‌సిరీస్‌ నటిగా సుష్మితాసేన్‌ (ఆర్య)ను పురస్కారాలు వరించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement