Tuesday, May 14, 2024

తెలంగాణలో మరో వారం లాక్‌డౌన్ పొడిగించే అవకాశం..

కరోనా కట్టడికి రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్ వల్ల కేసులు తగ్గుముఖం పడుతుండడంతో మరో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలని యోచిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.నిజానికి ఈ నెల 30తో లాక్‌డౌన్ ముగియనుంది. లాక్‌డౌన్ సత్ఫలితాలనే ఇచ్చిందని, మరికొన్ని రోజులు పొడిగిస్తే కేసులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

ఇక రాష్ట్రంలో ఇప్పుడు రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. కాబట్టి అమల్లో ఉన్న ఆంక్షలను కొంతమేర సడలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, 30న జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఈ విషయాలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, బ్లాక్ ఫంగస్‌కు చికిత్స, ఔషధాలు, రెండోదశ టీకాలు, కొవిడ్ పరీక్షల పెంపు, ఆక్సిజన్ ఉత్పత్తి, సేకరణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, వానాకాలం పంటల ప్రణాళిక తదితర అంశాలపై మంత్రి మండలి సమావేశంలో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement