Thursday, May 2, 2024

ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పెంపు

దేశంలో కరోనా పరిస్థితుల కారణంగా ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యక్తుల రిటర్నుల దాఖలు గడువును సెప్టెంబర్‌ 30 వరకు పొడిగిస్తూ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (CBDT) నిర్ణయం తీసుకుంది. అటు వ్యక్తుల రిటర్న్స్ మాత్రమే కాకుండా కంపెనీల రిటర్న్స్‎కు కూడా నవంబర్ 30 వరకు అవకాశం ఇచ్చింది. కాగా అంతకు ముందు వ్యక్తులు రిటర్న్స్ దాఖలు చేయడానికి జులై 31, కంపెనీలకు అక్టోబర్‌ 31 వరకు CBDT గడువు ఉండేది.

అటు కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసే ఫారం-16 గడువును కూడా జూలై 15వ తేదీ వరకు పెంచుతూ CBTD నిర్ణయం తీసుకుంది. ట్యాక్స్ రిటర్న్స్ దాఖలును సులభతరం చేయడానికి ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. పాత పోర్టల్ www.incometaxindiaefiling.gov.in స్థానంలో కొత్తపోర్టల్ www.incometaxgov.inను తీసుకురానుంది. జూన్ 7వ తేదీ నుండి ఈ కొత్త పోర్టల్ అందుబాటులో ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement