Friday, May 3, 2024

ఎవ‌రికి ప‌ట్టం – ఎంత భ‌ద్రం?

హైదరాబాద్‌, తెలంగాణలో పట్టభద్ర ఎమ్మెల్సీ హీట్‌ కొనసాగుతోంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధిగా డాక్టర్‌ పల్లా రాజేశ్వరరెడ్డిని ప్రకటించిన టీఆర్‌ఎస్‌ పార్టీ అధి నేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం బీఫాం అందజేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీలో ఎంతోకాలంగా క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విశ్వాస పాత్రునిగా, పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల నిర్వ హణలో, లక్ష్యాల సాధనలో ముందున్నారు. తనను అభ్యర్ధిగా ఎంపిక చేసి బి-ఫాం అందజేసిన సీఎం కేసీఆర్‌కు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు పల్లా రాజేశ్వరరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ మూడు జిల్లాల్లో నియోజక వర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి ప్రచారాన్ని హీటెక్కించగా, పట్టభద్రుల్లో పల్లా రాజేశ్వరరెడ్డికి సానుకూల వాతావరణం కనబడుతోందని, మంచి మెజారిటీతో విజయం ఖాయమని టీఆర్‌ఎస్‌ వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఈనెల 23న భారీ ర్యాలీగా నల్లగొండ పట్టణంలో పల్లా రాజేశ్వరరెడ్డి నామినేషన్‌ వేయనున్నారు. ఆదినుండీ ఆ నియో జకవర్గం టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉంది. వరుస గా మూడు సార్లు ఈ స్థానంలో గులాబీ జెండా ఎగరగా, నాల్గవ సారి కూడా అదే రిపీట్‌ చేయాలని గులాబీశ్రేణులు పట్టుదలగా పనిచేస్తున్నాయి. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధిగా ప్రేమేందర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్ధిగా రాములునాయక్‌, టిజెఎస్‌ అభ్యర్ధిగా ప్రొఫెసర్‌ కోదండరాం, వామపక్షాల అభ్యర్ధిగా జయసారధిరెడ్డి పోటీచేస్తుండగా, రాణిరుద్రమ, తీన్మార్‌ మల్లన్న, చెరుకుసుధాకర్‌ వంటి నేతలు కూడా బరిలోకి దిగి తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధానపార్టీల అభ్యర్ధులు నామినేషన్లు వేయాల్సి ఉంది. మహబూబ్‌నగర్‌ – రంగారెడ్డి – హైదరాబాద్‌ స్థానానికి టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఈ స్థానం విషయంలో టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. విపక్షాలను తికమకపెడుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌ – రంగారెడ్డి – ఖమ్మం స్థానంతో పాటు నల్గొండ – వరంగల్‌ – ఖమ్మం స్థానానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ గడువు ఇచ్చారు. మార్చి 14న పోలింగ్‌ 17న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
హైదరాబాద్‌-పాలమూరులో విభిన్న సమీకరణలు
హైదరాబాద్‌, పాలమూరు, రంగారెడ్డి పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవ ర్గంలో విభిన్న సమీకరణలు ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, బీజేపీ నేత ఎన్‌.రామచందర్‌ రావునే టీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి అభ్యర్ధిగా ప్రకటించింది. ముందునుండే ఆయన ఈ మూడు జిల్లాల్లో ప్రణాళికాబ ద్దంగా ప్రచారం చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కూడా ఈ స్థానంలో.. బరిలోకి దిగుతున్నారు. సభలు, సమావేశాలతో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్ధిగా మాజీ మంత్రి చిన్నారెడ్డిని ప్రకటించగా, మూడు జిల్లాల్లో ఉన్న పరిచయాలు.. సౌమ్యుడిగా పేరు కలిసివస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. ఇక్కడ బలమైన ప్రత్యర్ధులు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇక టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా మొదట మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ నిలుపుతారని ప్రచారం జరిగింది. పలువురు ఆశావహులు ప్రయత్నాలు కూడా చేసుకున్నారు. అయితే టీఆర్‌ఎస్‌ త్వరలో అభ్యర్ధిని ఖరారుచేస్తామని ప్రకటించింది. అభ్యర్ధిని ఖరారుచేస్తుందా.. మరొకరికి మద్దతునిస్తుందా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. టిడిపి కూడా ఈ స్థానంలో బరిలోకి దిగుతోంది. అటు నల్లగొండ, వరంగల్‌ స్థానానికి ఇటు హైదరాబాద్‌, పాలమూరు, రంగారెడ్డి స్థానానికి భిన్నమైన రాజకీయ వాతావరణం ఉంది. రెండు స్థానాల్లో తడాఖా చాటేందుకు.. గులాబీ దళపతి కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement