Wednesday, April 24, 2024

లింగుస్వామికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ‘రామ్’

రీసెంట్‌గా రెడ్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించిన హీరో  రామ్ త‌న త‌ర్వాతి చిత్రాల‌ని  లింగుస్వామి, నేస‌న్, త్రివిక్ర‌మ్ వంటి స్టార్ డైరెక్ట‌ర్స్‌తో చేయ‌నున్న‌ట్టు కొన్నాళ్ళ‌గా ప్ర‌చారం జ‌రుగుతూ వ‌చ్చింది.తాజాగా రామ్ 19వ సినిమాపై అఫీషియ‌ల్ ప్ర‌కట‌న‌ వ‌చ్చింది. ‘పందెం కోడి’, ‘ఆవారా’ తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అల‌రించిన లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి సినిమా ఉంటుంద‌ని ప్ర‌క‌టించాడు. సిల్వ‌ర్ స్కీన్ ప‌తాకంపై శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఏప్రిల్‌లో చిత్రం సెట్స్ పైకి వెళుతుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ మూవీని తెలుగు, త‌మిళ భాష‌ల‌లో రూపొందించ‌నున్నారు. మూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు మ‌రి కొద్ది రోజుల‌లో రివీల్ చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement