Friday, April 26, 2024

జడ్జీల నియామకంలో రచ్చ దేనికి

న్యాయవ్యవస్థ పని తీరులో జోక్యం చేసుకో బోమని తరచూ మంత్రులూ, అధికార పార్టీ నాయకులు స్పష్టం చేస్తుంటారు. కానీ, ఆచరణలో అందుకు భిన్నంగా జరుగు తోంది. ఈ విషయంలో పార్లమెంటులోనూ, బయటా చర్చ జరుగుతోంది. కోర్టుల్లో వివాదాలు పరిష్కారం కాకపోవడం వల్ల ఐదు కోట్లు పైగా కేసులు పేరుకుని పోయాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు గురువారం నాడు పార్లమెంటులో స్పష్టం చేశారు. న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉండటమే ఇందుకు కారణమని కూడా ఆయన వివరణ ఇచ్చారు. ఇందుకు ఎవరు బాధ్యులు? ప్రభుత్వమా? న్యాయవ్యవస్థా అనే అంశంపై చర్చ జరుగుతోంది. నిజానికి ఇది అంత ర్గతంగా పరిష్కరించు కోవల్సిన అంశం. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ ,చట్టసభలు, పత్రికా వ్యవస్థ రాజ్యాంగానికి మూల స్తంభాలు. వీటిలో ఏదీ ఎక్కువా కాదు,తక్కువా కాదు. వేటికవి తమ పరిధుల్లో పని చేయాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కోకా సుబ్బారావుసహా పలువురు న్యాయశాస్త్ర కోవిదులు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. స్వాతం త్య్రం వచ్చిన నాటి నుంచి ఎమర్జెన్సీ విధించే వరకూ న్యాయమూర్తుల నియామకం,పని తీరుపై దేశంలో ఎక్కడా చర్చ జరగలేదు. న్యాయమూర్తులు ప్రభుత్వానికి లోబడి ఉండేట్టు చేయడం కోసం అప్పట్లో కొంత ప్రయత్నం జరిగింది.

అయితే, చైతన్యవంతమైన న్యాయవ్యవస్థ,న్యాయవాద వ్యవస్థ ఆ ప్రయత్నాలను తిప్పికొట్టింది. ఆనాటి ప్రభుత్వ యత్నాలను విమర్శించిన వారే ఇప్పుడు మరో రూపంలో న్యాయవ్యవస్థలో జోక్యానికి ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఎంపిక, నియామకం మొ దలైన వన్నీ గతంలో చడీచప్పుడు లేకుండా జరిగి పోయేవి. యూపీఏ ప్రభుత్వంలో కూడా ఈ విషయమై విమర్శలు వచ్చినా, ఎప్పుడూ బయట పడలేదు. ఇప్పుడు మాత్రమే ఎందుకు చర్చ జరుగుతోంది. కొలీజియం వ్యవస్థ అంటే న్యాయమూర్తులను ఎంపిక చేసే వ్యవస్థ. ఇది పారదర్శకంగా పని చేయడం లేదని మాజీ న్యాయమూర్తులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో గందరగోళాన్ని తొలగించేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగాయి. న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడుకుంటూనే ఈ విషయమై ప్రభుత్వం కొన్ని నిర్ది ష్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవచ్చని కొందరు మాజీ న్యాయమూర్తులు సూచించారు. కానీ, ఈ విషయమై చొరవ తీసుకోవల్సింది ప్రభుత్వమే. ప్రభుత్వాన్ని విమర్శించేవారు, ప్రశం సించేవారు అనే రెండు వర్గాలుగా న్యాయమూర్తులు విడిపోయినప్పుడు కొలీజియం ఏర్పాటులో సహజంగానే ప్రభుత్వాన్ని ప్రశంసించేవారికే అవకాశాలు దక్కుతున్నాయి.

ఈ విషయంలో జస్టిస్‌ కర్ణన్‌ ఉదాహరణగా చూపుతున్నారు. ఆయన అరెస్టు అయ్యే వరకూ పరిణామాలు దారితీశాయి. అలాగే, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎంఆర్‌ షాలు ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఇవి అవాంఛనీయ ధోరణులుగా న్యాయశాస్త్ర కోవిదులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం కూడా న్యాయవ్యవస్థకు తగిన వసతులు, మౌలిక సదుపాయాలను కల్పించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జస్టిస్‌ ఎన్‌వి రమణ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఈ విష యమై తరచూ ప్రస్తావించేవారు. తన పరిధిలో కొంత వరకూ ఆయన కృషి ఫలించింది. తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్య పెరిగేట్టు చేశారు. అలాగే, సంప్రదింపుల ద్వారా వివాదాల పరిష్కార న్యాయ స్థానాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు అయ్యేందుకు కృషి చేశారు. దీని వల్ల ఈ న్యాయస్థానానికి వచ్చే వివా దాల పరిష్కారం కోసం గతంలో సింగపూర్‌ వెళ్ళేవారు. సబార్డినేట్‌ కోర్టుల్లో కూడామౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టి అందుకోసం కృషి చేశారు. అయితే, ఆయన ఆ పదవిలోఉన్నది కొద్ది కాలమే కావడంతో వ్యవధి సరి పోలేదు. న్యాయమూర్తుల సంఖ్య విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం వల్లనే సమస్య అపరి ష్కృతంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి.

- Advertisement -

కొలీజియం వ్యవస్థ సూచించిన పేర్లను ప్రభుత్వం పూర్తిగా పరి గణనలోకి తీసుకోవడం లేదు.ఈ మధ్య 20 న్యా యమూర్తుల పదవులకు వచ్చిన సిఫార్సులను ప్రభు త్వం నిరాకరించింది.ఈ వారంలోనే సుప్రీంకోర్టులో ఐదు న్యాయమూర్తి పదవులకు వచ్చిన సిఫార్సులను ఆమోదించింది. అందువల్ల కొలీజియం వ్యవస్థను తప్పు పట్టడానికి వీలు లేదు.ప్రభుత్వమే ఈ విషయమై చొరవ తీసుకోవాలి. న్యాయమూర్తుల నియామకం లో తమకుగతంలో ఉండే హక్కు కొలీజియం వ్యవస్థ వచ్చి న తర్వాత పోయిందనే ప్రభుత్వం ఇలా చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా సుప్రీంకోర్టు నుంచి, కింది కోర్టుల వరకూ న్యాయమూర్తుల పోస్టులు ఖాళీలు గా ఉన్నాయన్నది యధార్ధం.కొలీజియం వ్యవస్థ బాగా చేస్తున్నప్పుడు దాని సిఫార్సులను ఎందుకు పరిగణ నలోకి తీసుకోదన్న ప్రశ్న తలెత్తుతున్నది. లోపా లు, అపారదర్శకత అనేవి అన్ని చోట్లా ఉన్నాయి. వాటి పేరు చెప్పి ఉన్న వ్యవస్థను ఉపయోగించుకోకపోతే ఆ తప్పు ప్రభుత్వానిదే అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement