Thursday, February 8, 2024

Editorial: జ్ఞానవాపిలో పూజకు వేళాయె

హిందువులకు అత్యంత పుణ్య క్షేత్రమైన కాశీ విశ్వేశ్వరాలయం పక్కన ఉన్న జ్ఞానవాపి మసీదులోని బేస్‌మెంట్‌ (నేలమాళిగ)లో త్రిశూలం,స్వస్తిక్‌,కమలం వంటి ఆకృతులు ఉన్నాయి. వాటికి పూజలు చేసుకునేం దుకు అనుమతి ఇవ్వాలన్నకొందరు హిందు మహిళల అభ్యర్ధనను వారణాసి కోర్టు అంగీకరించింది.

- Advertisement -
   

బారికేడ్ల ను తొలగించి ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కూడా వారణాసి కోర్టు ఆదేశించింది. దశాబ్దాలుగా తాము జరుపుతున్న న్యాయపోరాటానికి ఇది విజయమని హిందూ సంఘాలు పేర్కొంటున్నాయి. మొగలాయీ చక్రవర్తి అక్బర్‌ ఆస్థానంలో మంత్రిగా వ్యవహరించిన తోడర్‌మల్లు కాశీ విశ్వేశ్వరాలయాన్ని నిర్మించారు. అదే సందర్భంలో పక్కనే జ్ఞానవాపిని కూడా నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. జ్ఞానవాపి అంటే జ్ఞాన కూపం అని అర్థం. పేరును బట్టే ఇది హిందూ సంప్ర దాయానికి చెందిందన్న అభిప్రాయం బలపడుతోంది. ఈ వాదాన్ని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు యోగీ ఆదిత్య నాథ్‌ సమర్ధిస్తున్నారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని, దీనిని సరిదిద్దుకోవడానికి ముస్లిం సోదరులు ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. హిందూ వర్గాలు దాఖలు చేసిన పిటిషన్‌ను పురస్కరించుకుని భారత పురావస్తు పరిశోధనా సంస్థ చేత పరిశోధనలు జరిపించి ఇది 16వ శతాబ్దంలో హిందూ ఆలయం స్థానే నిర్మించిన మసీదు అని తేల్చారు.

చరిత్ర పరిశోధకునలు మాధురీ దేశాయ్‌ కూడా ఈ వాదాన్ని సమర్ధిస్తున్నారు. ఆనాటి రాజులు ఈ ఆల యాన్ని రూపురేఖలు మార్చేందుకు మొగలాయీ సంప్రదాయం ప్రకారం మసీదును నిర్మించి ఉండ వచ్చని ఆయన కూడా స్పష్టం చేస్తున్నారు. కన్నౌజ్‌ రాజు జయచంద్రుని ఓటమి తర్వాత మసీదు నిర్మాణం జరిగి ఉండవచ్చని దేశాయ్‌ అంచనా వేస్తున్నారు. ఈ మసీదు బేస్‌మెంట్‌ లో హిందూ దేవతా మూర్తుల ఆనవాళ్ళు ఉన్నట్టు సర్వేలో తేలిందని హిందువుల తరఫు న్యాయ వాది విష్ణు శంకర్‌ జైన్‌ కూడా వాదిస్తున్నారు.ఈ మసీదు కింద హిందూ ఆలయం ఆనవాళ్ళు ఉన్నట్టు సర్వేలో తేలిందని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ ఆలయ ప్రాం గణంలో తెలుగు,కన్నడ, దేవనాగరి సహా 34 భాషల్లో శాసనాల ఆనవాళ్ళు ఉన్నట్టు తేల్చిన సర్వే నిపుణులను ఉటంకిస్తూ ఆయన స్పష్టం చేస్తున్నారు.

ఈ శాసనాల్లో రుద్ర, జనార్దన, ఉమామహేశ్వర వంటి హిందూ దేవ తల ఆకృతులు ఉన్నాయని సర్వే నివేదికను ఉటంకిస్తూ ఆయన తెలిపారు. అయోధ్యలో రామాలయం నిర్మా ణానికి మార్గం సుగమం అయిన నాటి నుండి జ్ఞానవాపి మసీదు కింద ఆలయం ఆనవాళ్ళపై సర్వే జరిపించాలని హిందూ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కాశీ విశ్వేశ్వ రాలయం నిర్మాణ సమయంలో తోడర్‌మల్లు 16వ శతా బ్దంలో మహారాష్ట్ర నుంచి వేద పండితులను రప్పించి ఇక్కడ యజ్ఞయాగాలను నిర్వహించినట్టు కూడా ఆధారాలున్నాయని హిందూ సంఘాల వారు స్పష్టం చేస్తున్నారు. ఔరంగజేబు కాలంలో ఈ ఆలయాన్ని కూల్చివేయడంలో మత పరమైన ద్వేషం కన్నా, అధి కార విస్తరణలో భాగంగానే ఈ చర్యకు పాల్పడి ఉండ వచ్చని చరిత్ర కారులను ఉటంకిస్తూ హిందూ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

అయితే, ముస్లిం వర్గాలు ఈ వాదాన్ని తోసిపుచ్చుతున్నారు. గుజరాత్‌లోని జాన్‌పూర్‌కి చెందిన వ్యాపారి ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మించారని హిందువులు వాదిస్తున్నారు. బ్రిటిష్‌ వారి కాలంలో ఈ ప్రాంతాన్ని మసీదుగా ఎవరూ పరిగణించలేదని ఎడ్విన్‌ గ్రీవ్స్‌ అనే బ్రిటిష్‌ పరిశోధకుడు పేర్కొన్నారు. ఆయన వాదాన్ని ముస్లింలు తోసిపుచ్చారు.ఇది కుట్రలో భాగ మని వారు ఆరోపించారు.అయితే, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇక్కడ పావెలీన్‌ వద్ద హిందూ మహాసభ మహా శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకాన్ని నిర్వహించినట్టు ఆధారాలున్నాయని హిందూ మహాసభ వాదిస్తోంది. 1984లో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది.మసీదు గోడలపై శివుడు, శింగార్‌,గౌరీ, గణష్‌ల ఆకృతులు ఉన్నాయని ఈ రెండు సంస్థలు కోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశాయి. వీటిని ముస్లిం సంఘాలు సవాల్‌ చేశాయి.

1997లోసివిల్‌ కోర్టులో దీనిపై విచారణ జరిగింది.2021లో తిరిగి సర్వే కు అనుమతి ఇచ్చారు.వారణాసి కోర్టు ఇప్పుడు ఆ ఆలయం నేలమాళిగల్లో ఉన్న హిందూ దేవతల ఆకృతులకు పూజలునిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడాన్ని హిందూ సంఘాలు తమ న్యాయపోరాటానికి ఘన విజ యమని వర్ణిస్తున్నాయి. వారణాసి కోర్టు తీర్పు నేప థ్యంలో మసీదును హిందూ ఆలయంగా ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. జ్ఞానవాపి మసీదు ప్రదేశం లో ఆలయ నిర్మాణం కోసం విశ్వహిందూ పరిషత్‌ ఆందోళనకు సమాయత్తమవుతోంది. మరో వంక అంజుమన్‌ సంస్థ ఉన్నత న్యాయస్థానంలో పోరాటానికి సిద్ధం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement