Thursday, April 25, 2024

రాష్ట్రాలు.. సరిహద్దు రాజకీయం

కర్నాటక – మహా రాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం రోజు రోజుకీ తీవ్రమవుతోంది. ఈ వివాదంలో ఎవరూ తక్కు వ కాదన్నట్టు రెండు రాష్ట్రాలు అసెంబ్లిdల్లో తీర్మానాలు చేస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఇది పెద్ద తలనొప్పిలా తయారైంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇరు రాష్ట్రా ల సీఎంలకు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నం ఫలించ లేదు. కర్నాటక అసెంబ్లిdకి త్వరలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా సరిహద్దు వివాదాన్ని ఎన్నికల ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలని కర్నాటక అనుకుంటోంది. మహారాష్ట్ర అసెంబ్లిd తీర్మానంలో బెల్గామ్‌, బీదర్‌, కార్వార్‌, నిప్పాణిలతో సహా మరాటీ మాట్లాడే ప్రజలున్న గ్రామాలన్నీ మహారాష్ట్రకే చెందుతాయని రాష్ట్రప్రభు త్వం స్పష్టం చేసింది. మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే నేతృ త్వంలోని చీలిక వర్గం, బీజేపీ కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఈ విషయంలో ఏమాత్రం మెత్తబ డినా సహించేది లేదని షిండేని బీజేపీ హెచ్చరించింది.

అలాగే, కర్నాటకలో బసవరాజ్‌ బొమ్మయ్‌ నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వం వచ్చే ఏడాది అసెంబ్లిd ఎన్నికలను ఎదుర్కోనుంది. బసవరాజ్‌కి బలం లేదు. ఆయన పూర్తిగా తన గురువు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడి యూరప్పపై ఆధారపడి ఉన్నారు. తనను బలవంతంగా దింపేసి బసవరాజ్‌ని గ ద్దెనెక్కించినందుకు యడియూ రప్ప ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ తరుణంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒత్తిళ్లతో సతమతమవు తున్నారు. మహారాష్ట్రలో శివసేన అధికారాన్ని కోల్పోవ డంతో బీజేపీపై పగ తీర్చుకోవడానికి ఈ సమస్యను ఒక అస్త్రంగా ఉపయోగించుకోవాలనుకుంటోంది. శివసేన పార్టీ భాషా సంస్కృతుల పునాదులపై ఏర్పడింది. అక్కడ మరాటీకి అన్యాయం జరిగితే శివసేన ఉద్యమం ప్రారం భిస్తుంది. ఇప్పటికే ఏక్‌నాథ్‌ వర్గానికీ బీజేపీకీ మధ్య భాషా, సంస్కృతుల విషయమై కలహాలు చెలరేగుతోంది.

షిండే వర్గం బీజేపీ ఒత్తిడికి లొంగి భాషాసంస్కృతుల విషయంలో రాజీ పడుతోందని శివసేన అధ్యక్షుడు ఉద్ధ వ్‌ థాకరే పలుసార్లు ఆరోపించారు. తాను ముఖ్యమం త్రిగా ఉన్నప్పుడు కూడా బీజేపీ ఈ విషయమై తనపై ఎన్నోసార్లు ఒత్తిడి తెచ్చిందని ఆయన ఆరోపించారు. బెల్గామ్‌ సరిహద్దు గ్రామాల విషయంలో శివసేన, గతం లో కాంగ్రెస్‌, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) ఆనాటి యూపీఏ హయాంలోనూ, అంతకుముందు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనూ కేంద్రంపై ఒత్తిడి తె చ్చేవి. ఈ ప్రాంతాల మధ్య రగడ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న ప్పటి నుంచి కొనసాగుతున్నాయి. అయితే, బెల్గామ్‌కి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు శంకరానంద వం టి వారికి నచ్చజెప్పి ఇందిరాగాంధీ వివాదం పెరగకుం డా చేశారు. అసలు ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి ఉత్తర కర్నాటక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాల ని అప్పట్లో ఉద్యమాలు నడిచాయి.

- Advertisement -

రాష్ట్రాల పునర్వ్యవ స్థీకరణ సమయంలో నైజాంలోని మరాటీ మాట్లాడే వారిని మహారాష్ట్రలోనూ, కన్నడం మాట్లాడే వారిని కర్నాటకలోనూ కలిపారు. అలా కలపడంలో మరాటీ భాష గ్రామాలు కొన్ని కర్నాటకలో చేరాయన్నది మహ రాష్ట్రీయుల వాదన. మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్య క్షుడు ఉద్ధవ్‌ థాకరే, ఏక్‌నాథ్‌ షిండేపై ప్రతీకారం తీర్చు కోవడానికి ఇదే మంచి అవకాశంగా భావిస్తున్నారు. బెల్గాం మునిసిపల్‌ కార్పొరేషన్‌ మరాటీ ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేయాలని తీర్మానం చేసినందుకు కర్నాటక ప్రభుత్వం చర్య తీసుకుందనీ, అలాంటి ధైర్యం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని ఉద్ధవ్‌ ఛాకరే షిండే ని సవాల్‌ చేశారు. మహారాష్ట్రలోనే కాకుండా గోవాలో కూడా మరాటీ ప్రాంతాలున్నాయనీ వాటిని కూడా మహారాష్ట్రలో కలపాలని అప్పట్లో తరచూ ఆందోళనలు జరుగుతూ ఉండేవి.

ఇందుకోసమే గోవాలో మహారాష్ట్ర వాదీ గోమంతక్‌ పార్టీ ప్రత్యేకంగా ఏర్పడింది. అందువల్ల దేనిని కదిల్చినా ఇది పెద్ద వివాదామవుతుందని భావించి ఈ అన్ని ప్రాంతాల్లో తమ పార్టీయే అధికారంలో ఉండేది కనుక, పదవులిచ్చి వారిని సంతృప్తి పర్చేవారు. అప్పట్లో కూడా ఎన్నికల ముందే ఇలాంటి సరిహద్దు వివాదాలు తెరపైకి వచ్చేవి. బసవరాజ్‌ బొమ్మయ్‌ని గద్దె దింపడానికి కర్నాటకలో యెడియూరప్ప మాత్రమే కాకుండా మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఈశ్వరప్ప తదిత రులు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంద రికీ మహారాష్ట్ర బీజేపీ నాయకులతో సంబంధాలున్నా యి. బసవరాజ్‌ సర్కార్‌ని అస్థిర పర్చేందుకు బీజేపీలో ఒక వర్గం గట్టిగా పని చేస్తోంది. అయితే, యెడియూ రప్ప, ఈశ్వరప్ప తదితరులంతా లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందినవారే. అందువల్ల ఇప్పుడు సరిహద్దు వివాదం అంతా పదవులు కోల్పోయిన నాయ కులు లేవనెత్తిందే తప్ప, మరొకటి కాదు. ప్రజల్లో ఉన్న అసం తృప్తిని ఎన్నికల ముందు రాజేసి రాజకీయ ప్రయో జనం పొందేందుకు రెండు రాష్ట్రాల్లో అసమ్మతివాదులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement