Thursday, March 28, 2024

ఇస్రో… అంతరిక్ష మైత్రి!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష విజ్ఞానంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఈ రంగంలోఅంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. ఇస్రో ఘనకీర్తి గురించి బుధవారం పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చింది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో కొత్త అధ్యా యాన్ని సృష్టించింది. ఎంతో మంది శాస్త్రజ్ఞుల కృషి ఫలితంగా ఇస్రో ఈరోజు ఖండాంతర ఖ్యాతిని దక్కించుకుంది. స్వాతంత్య్రాంనంతరం రక్షణ రంగానికి, భూమి మీద, భూమి లోపల ఖనిజాల గురించి అధ్యయనానికి అంతరి క్ష పరిశోధనా సం స్థ అవసరాన్ని గుర్తించిన తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ అంకురార్పణ చేశారు. కేంద్రంలో శాస్త్ర సాంకేతిక శాఖను ఏర్పాటు చేశారు. సోవియట్‌ రష్యా 1967లో స్ఫుత్నిక్‌ని ప్రయోగించి నప్పుడు మన దేశంలో కూడా మన దేశం కూడా ఉప గ్రహాలను ప్రయోగించాల్సిన అవసరాన్ని నెహ్రూ గుర్తిం చారు. భారత అణు సంస్థ పితామహుడైన విక్రం సారాభాయ్‌ ఆధ్వర్యంలో ఇస్రో ఏర్పాటు అయింది. ఆ సంస్థ అప్పటి నుంచి ఇంతవరకూ ఎన్నో ఉపగ్రహాలను ప్రయోగించింది. మొదట్లో మన ఇస్రో తయారుచేసిన ఉపగ్రహాలను రష్యాలోని బైకనూర్‌ నుంచి ప్రయోగించే వారు. తర్వాత క్రమంగా అంతరిక్ష విజ్ఞానాన్ని పుణికి పుచ్చుకున్న మనదేశం శ్రీహరి కోటలోనుంచి ఉపగ్రహాల ను ప్రయోగించడం ప్రారంభించింది.మన దేశం మొద టి నుంచి ఉపగ్రహాల నిర్మాణపైన దృష్టిని కేంద్రీకరించింది. ఉపగ్రహాలను ప్రయోగించే సామర్ధ్యాన్ని కూడామన దేశం పుణికి పుచ్చుకుంది. మన దేశం రూపొందించిన మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను సోవియట్‌ యూనియ న్‌లోని బైకనూర్‌ నుంచి ప్రయోగించారు.

ఆ తర్వాత క్రమంగా మన శాస్త్రజ్ఞులు రాకెట్‌ ప్రయోగాలను చేపట్టారు. తిరువనంతపురం సమీపంలోని తుంబాలో మొదటి రాకెట్‌ని ప్రయోగించారు. అంతరిక్ష విజ్ఞానంలో భారతీయులు ఎవరికీ తీసిపోరని నిరూపించిన శాస్త్రజ్ఞుల్లో విక్రమ్‌ సారాభాయ్‌ సతీష్‌ ధావన్‌,మాధవన్‌ నాయర్‌ వంటి ప్రముఖులు ఎంతో కృషి చేశారు.స్వదేశీ ఉపగ్రహ ప్రయోగాలు విజయవంతం కావడంతో ఇతర దేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే కార్యక్రమా న్ని ఇస్రో చేపట్టి వివిధ దేశాల ప్రశంసలను అందుకుం టోంది. అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాల ద్వారా సేక రించిన సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకుంటోం ది. అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రరాజ్యమైన అమెరికా, ఒకప్పటి అగ్రరాజ్యానికి సారథ్యంవహించిన రష్యా తమ పట్టును నిలబెట్టుకున్న సమయంలోనే మన ఇస్రో ఉప గ్రహ ప్రయోగాల్లో ఆ రెండింటి కన్నా తక్కువ వ్యయం తో ఎక్కువ లాభసాటిగా ఉపగ్రహాలను ప్రయోగించడం ప్రారంభించడంతో ప్రపంచంలోని వివిధ దేశాలు మన ఇస్రో నుంచే ఉపగ్రహాలను పంపడం ప్రారంభించాయి. ఇతర దేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో ఇంతవరకూ 36 దేశాలకు చెందిన 346 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ఇస్రోను ఇప్పు డు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) బాగా ప్రోత్సహిస్తోంది.చైనా అంతరిక్ష ప్రయోగాలు ఇరుగు పొరుగు దేశాలు, లేదా శత్రుదేశాల నిగూఢ సమాచారాన్ని తెలుసుకోవడానికే ఉపయోగిస్తోంది.భారత్‌ అందు కు భిన్నంగా ఇతర దేశాలకు ఈ విషయంలో సాయపడ టమే కాకుండా,ఆయా దేశాల్లో లభించే భూగర్భ సంపద గురించిన సమాచారాన్ని అందిస్తోంది.

తక్కువ ఖర్చు తో ఉపగ్రహాలను పంపించే సామర్ధ్యాన్ని పొందడం వల్ల నే ఇతర దేశాలు ఇస్రో వైపు చూస్తున్నాయి. ఇస్రో ప్రస్థా నంలో ఎన్నో మైలు రాళ్ళు ఉన్నాయి.శ్రీహరికోటలో ఇస్రో ప్రయోగ కేంద్రాన్ని వృద్ధి చేయడంలో మాధవన్‌ నాయర్‌ కృషి ఎనలేనిది. ఇస్రో చంద్రయాన్‌ ప్రాజెక్టును విజయవంతం చేయడంలో ఇస్రో శాస్త్ర జ్ఞుల ప్రతిభను యావత్‌ ప్రపంచం గుర్తించింది. ఈ రంగంలో ఇంత వరకూ అగ్రరాజ్యాల గుత్తాధిపత్యాన్ని చెదరగొట్టిన మన శాస్త్రజ్ఞులను ఎంతో మంది అభినందించారు. క్షిపణుల తయారీ, ప్రయోగంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ ను భారత దేశపు క్షిపణి బ్రహ్మ గా ఇప్పటికీ కీర్తిస్తుంటారు. ఇస్రో విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా 279మిలియన్‌ డాలర్ల ఆదా యాన్ని పొందింది. వాణిజ్య అవసరాలకు అంతరిక్షం లోకి ఉపగ్రహాలను పంపడం అనే ప్రక్రియకు నాంది పలి కింది ఇస్రోయే. జూన్‌ 30 తేదీ న సింగపూర్‌కి చెందిన మూడు ఉపగ్రహాలను అంత రిక్షంలోకి పంపింది.ఇస్రో శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ ద్వారా 34దేశాలకు చెందిన 345 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. ఇస్రోద్వారా 56మిలి యన్‌ డాలర్లు, 220 మిలియన్‌ యూరోల ఆదాయం వచ్చింది. ఇరుగు పొరుగుదేశాలతో మైత్రిని పెంచుకోవ డానికి ఇస్రో వంటి సంస్థలు ఎంతో దోహదం చేస్తున్నాయి. ఇస్రోని మరింత అభివృద్ధి పర్చేందుకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement