మైక్రోబ్లాగింగ్, సోషల్ నెట్వర్కింగ్ సైట్ అయిన Twitter దాని ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ రేటుని పెంచేసింది. ఇప్పటిదాకా Twitter బ్లూ చార్జీని నెలవారీగా 2.99 డాలర్లు వసూలు చేసేవారు. ఇక నుంచి 4.99డాలర్లకు పెంచుతున్నట్లు కంపెనీ ఇవ్వాల తెలిపింది. ఇది ఇప్పటిదాకా ఉన్న చార్జీలో 66 శాతం పెరుగుదలను సూచిస్తోందని పలువురు టెక్ నిపుణులు చెబుతున్నారు. కాగా Twitter బ్లూ చందాదారులకు పంపిన ఈ–మెయిల్‌లో ఈ పెంచిన చార్జీలకు సంబంధించిన వివరాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ పెంచిన చార్జీలను ఇకపై కొత్తగా సబ్‌స్క్రైబ్ చేసుకునే కొత్త చందాదారులకు మాత్రమే వర్తింపజేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రైబర్‌లకు అక్టోబర్ వరకు ఈ పెంచిన చార్జీలు (అధిక రేటు) వసూలు చేయబోమని ట్విట్టర్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ట్విట్టర్ ప్రారంభ సమయంలో తాము దీనిపై పరిశీలనలు చేసినప్పుడు,యూజర్ల అభిప్రాయాలను తీసుకున్నప్పుడు సబ్‌స్క్రిప్షన్ ధరను వీలైనంత తక్కువగా ఉంచాలని భావించామని, అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో పెంచక తప్పడం లేదని ట్విట్టర్ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే.. ప్రారంభంలో ఉన్నప్పటి సేవల కంటే దీన్ని బాగా డెవలప్ చేశామని, ఎంతో మెరుగైన సేవలను అందిస్తున్నట్టు తెలిపారు..కాగా, ఈ ప్రీమియం యూజర్లకు వారు చేసిన ట్వీట్‌ను డిలీట్ చేసుకోవడం, ట్వీట్లో మరింత కంటెంట్ యాడ్ చేయడం, యాడ్స్ లేని ఫీచర్‌ల కోసం ఈ అమౌంట్ తీసుకుంటున్నామని ట్విట్టర్ ప్రతినిధి వివరించారు.
అంతేకాకుండా జర్నలిజానికి మద్దతు ఇచ్చే ప్రయత్నంలో తాము కొత్త కొత్త ఫీచర్‌లను మరింత డెవలప్ చేస్తున్నట్టు ట్విట్టర్ తెలియజేస్తోంది. ఇప్పటికే ఉన్న వాటిని మరింత డెవలప్ చేయడం కోసం ధరల పెంపు తప్పడం లేదని దాని ప్రతినిధులు చెబుతున్నారు. ఇక.. Twitter బ్లూ వినియోగదారులకు 30-సెకన్ల అన్డూ ట్వీట్ విండోను అందుబాటులో ఉంచబోతున్నారు. ఇది Twitterలో పోస్ట్ చేసే ముందు వారి ట్వీట్లకు సవరణ చేయడం, తొలగించడం వంటివి చేసే అవకాశం ఉంటుంది.. అంతేకాకుండా ఇది యూజర్లకు డిఫరెంట్ థీమ్స్, ఎక్స్పీరియన్స్, సైన్స్‌తో కూడిన పలు అంశాలతోపాటు.. బుక్‌మార్క్ ఫోల్డర్‌లో ట్వీట్‌లను నిర్వహించడానికి కూడా పర్మిషన్ ఇస్తుంది.
