Monday, December 4, 2023

Editorial – న‌క్స‌లిజంపై ఏది దారి…

వామపక్ష తీవ్రవాదం.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు నిండిన ఈ సంర్భంలో.. ట్రిలియన్‌ డాలర్ల వ్యవస్థ గురించి కలలుకంటున్న నేపథ్యంలో దీని గురించి ఇంకా సమీక్షించాల్సి రావడం దురదృష్టకరమే. ఇప్పటికే బాగా తగ్గిందని, రెండేళ్లలో పూర్తిగా నిర్మూలిస్తామని సంక ల్పం చెప్పుకున్నామంట.. దాని మూలాలు మాత్రం అలానే ఉన్నాయని భావించక తప్పదు. వామపక్ష తీవ్రవాదాన్ని రెండేళ్ళల్లో పూర్తిగా అంతమొందిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. వామపక్ష తీవ్రవాదం వల్ల ఎన్నో కుటుంబాల వారు అనాధలవుతు న్నారని ఆయన అన్నారు. 2020తో పోలిస్తే 2022లో వామపక్ష తీవ్రవాదం బాగా తగ్గిందన్నారు. ఆయన మాటల్లో అర్ధ సత్యం ఉంది. మన దేశంలో వామపక్ష తీవ్రవాదానికి ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది. నక్సలిజం అనే పేరు బెంగాల్‌లోని నక్సల్‌బరి ప్రాంతానికి చెందిం ది. అక్కడ పుట్టిన నక్సలిజం తర్వాత దేశమంతటా వ్యాపించింది.

- Advertisement -
   

తెలంగాణలో ఎక్కువ విస్తరించింది. ఆ తర్వాత ఇప్పుడు జార్ఖండ్‌, చ త్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో మిగిలి ఉంది. తెలంగాణలో పూర్తిగా అదుపులో ఉంది. భూస్వా ముల బారి నుంచి గిరిజనులు, వ్యవసాయ కూలీలను రక్షించడానికి వామపక్ష తీవ్రవాదులు సాయుధ పోరాటా న్ని ప్రారంభించారు. దానికే నక్సలిజం అనే పేరు వచ్చిం ది. తదనంతర కాలంలో మావోయిస్టు పార్టీగా పేరు మారింది. భూస్వాములను అంతమొందిస్తే వ్యవసాయ కూలీలకు, నిరుపేదలకు విముక్తి లభిస్తుందన్నది మావో యిస్టుల వాదన. అయితే, వ్యవస్థలో లోపాలను సరిదిద్ద కుండా వ్యక్తులను అంతమొందించడం వల్ల ప్రయోజ నం ఏమిటని మేధావుల ప్రశ్న. మావోయిజం (నక్సలి జం) వ్యాప్తి పెరిగిన కొద్దీ, భూస్వాముల వేధింపులు పెరిగిపోతున్నాయి. ఆర్థిక అసమానతలు పెరిగి పోతు న్నాయి. మావోయిస్టులను అణచివేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తు న్నాయి. ఇప్పటికి వేలమంది పోలీసులు బలి అయ్యారు. ఈ ఉద్యమం పేరు చెప్పి, అటు మావోయిస్టుల్లోను, ఇటు పోలీసుల్లోనూ ప్రాణాలు కోల్పోతోంది బలహీనవర్గాల వారే.

పోలీసు శాఖలో రిస్క్‌ ఉన్న ఉద్యోగాల్లో ఎక్కువ మంది బలహీనవర్గాల వారే చేరుతున్నారు. మావోయి స్టుల కాల్పుల్లో సమిధలు అవుతున్నదీ వారే. అలాగే, నక్సలైట్‌ ఉద్యమంలో చేరిన వారిలో అధికంగా బలహీన వర్గాలకు చెందినవారే ఉంటున్నారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణిస్తున్నదీ ఎక్కువగా వారే. దేశంలో సమాచార సాంకేతికత (ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ) పెరిగిన తర్వాత నక్సలైట్‌ ఉద్యమానికి ఆదరణ తగ్గిన మాట నిజమే.

ఇంజనీరింగ్‌, మెడిసిన్‌లలో పట్టాలు సంపాదిం చినా ఉద్యోగాలు రాకపోవడంతో గతంలో ఆ పట్టభద్రు లు నక్సలైట్‌ ఉద్యమంలో చేరేవారు. ఇప్పుడు ఐటి లో పట్టాలు సంపాదించిన వారికి క్యాంపస్‌ సెలక్షన్స్‌ పే రిట వెంటనే ఉద్యోగాలు వస్తున్నాయి. అందువల్ల ఉద్యోగార్థు ల సంఖ్య బాగా తగ్గింది. ప్రభుత్వోద్యోగాల కన్నా ఇప్పు డు ప్రైవేటు సంస్థల్లో మంచి జీతాలు, ఉద్యోగాభివృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నందున కూడా ఉద్యోగా ర్థుల సంఖ్య తగ్గింది. ఈ కారణంగా యువకులు, విద్యా ధికులు మావోయిస్టు ఉద్యమంలోకి రావడం కూడా తగ్గింది. మావోయిస్టు ఉద్యమం పల్చబడటానికి అసలు కారణం అది. అయితే, ప్రభుత్వం అనుసరిస్తున్న అణచి వేత వైఖరివల్ల తీవ్రవాదం తగ్గిందని ప్రభుత్వం వాది స్తోంది. అది పూర్తిగా నిజం కాదు.

వామపక్ష ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి అణచివేత చర్యలే ఏకైక మార్గమని ప్రభుత్వం గతంలో అను కునేది. వాటి వల్ల ప్రయోజనం లేదనీ, మావోయిస్టులకు నచ్చజెప్పి జనజీవన స్రవంతి లోకి తీసుకుని రావాలన్న వ్యూహాన్ని కొంత కాలం అమలు జేసింది. ఈ రెండు వ్యూహాలను ఏకకాలంలో మరి కొంతకాలం అమలు జేసింది. ఇప్పుడు మావోయి స్టులకు ఆశ్రయం కల్పిస్తు న్నారంటూ మేధావులపై విరు చుకుని పడుతోంది.

అర్బన్‌ నక్సలిజాన్ని అణచివేయ డమే లక్ష్యమంటూ నగరాలు, పట్టణాల్లో లాయర్లు, డాక్ట ర్లు, మేధావుల ఇళ్ళల్లో సోదాలు జరపడం ముఖ్యమైన పత్రాలు దొరికాయంటూ వాటిని పట్టుకుని పోవడం, వాటి ఆధా రంగా వామపక్ష సానుభూతిపరులను అరెస్టు చేయడం వంటి చర్యలకు ప్రభుత్వం ఒడిగడుతోంది. ఈ మధ్యనే తెలుగు రాష్ట్రాల్లో 81 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దళాలు సోదాలను నిర్వహించాయి. గంటల తరబడి న్యాయవాదులను, మేధావులను ప్రశ్నిం చాయి. కానీ వారికి కావల్సిన సమాచారం దొరకలేదు. వామ పక్ష తీవ్రవాదాన్ని అణచివేయడానికి మావోయిస్టు నాయకులను చర్చలకు పిలుస్తామన్న ప్రతిపాదన ప్రహసనంగా మారింది.మావోయిస్టు ఉద్యమ ప్రభావం తగ్గింది కానీ, పూర్తిగా నిర్మూలించే దశలో లేదు. అర్బన్‌ మావోయిస్టుల దాడుల పేరిట ప్రభుత్వం చేస్తున్న హడావుడినిబట్టి ఆ ఉద్యమం నివురుగప్పిన నిప్పులా ఉందనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement