Thursday, May 2, 2024

Editorial – భ‌ద్ర‌తా లోపం … మాన‌వ త‌ప్పిందం..

మన జీవితాలు ఎంత భద్రంగా ఉన్నాయి? ఇంట్లోం చి బయటకు వెళ్ళిన వారు క్షేమంగా తిరిగి వస్తారన్న నమ్మకం లేదు. మనం తీసుకునే ఆహారం, పీల్చే గాలి సురక్షితమైనదని చెప్పలేం. బతకడం కష్టం అవుతున్న ఈరోజుల్లో ఏదో రకంగా బతకేయడానికి మనిషి అలవాటు పడ్డాడు. అలాగే, ప్రయాణాలకూనూ. రైళ్ళ ల్లో కానీ, ప్రభుత్వ రవాణా సంస్థల్లో కానీ రిజర్వేషన్లు ముందే అయిపోతాయి. అత్యవసర పనులపై సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారు ప్రాణాలకు తెగించి జనరల్‌ బోగీల్లో రైలు ప్రయాణం చేస్తున్నారు. అలాంటప్పుుడు భద్రతా ప్రమాణాలను పాటించలేదని ఆయా సంస్థల యాజమాన్యాలను వేలెత్తి చూపలేం. ఇటీవల ఒడిషా లోని బాలాసోర్‌లో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదా నికీ, శుక్రవారం నాడు భువనగిరి సమీపంలో ఫలక్‌ నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగడానికీ, భద్రతా లోపానికి తోడు మానవ తప్పిదాలే కారణం. తప్పుడు సిగ్నల్‌ వల్ల కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం జరిగిందని నిపుణుల కమిటీ దర్యాప్తులో తేలింది. ఫలక్‌నుమా లోని 18 బోగీల్లో ఆరు అగ్నిప్రమాదానికి లోనయ్యాయి. వీటిలో మూడు బోగీలు పూర్తిగా దగ్ధమ య్యాయి. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎవరూ మరణించడం కానీ, గాయపడటం కానీ జరగలేదు. లోకో పైలట్‌ హెచ్చరిక కారణంగా ఘోర ప్రమాదం తప్పింది. ఒక బోగీలో పొగలు వ్యాపించడంతో ఒక ప్రయాణీకుడు చైన్‌ లాగడంతో ప్రమాదం తప్పిందన్న వార్త కూడా వచ్చింది.

ఏమైనా ఒడిషాలో రైలు ప్రమా దం జరిగిన నెలన్నర లోపే ఫలక్‌నుమాలో మంటలు చెలరేగడం దురదృష్టకరం. ఇది కూడా ఎక్స్‌ప్రెస్‌ రైలే. అయినప్పటికీ భద్రతా ప్రమాణాలు అంతంత మాత్రం గా ఉన్నాయని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) పోలీసులు లాటీలు కొట్టుకుంటూ హడావుడి చేయడంతప్ప భద్రతా ప్రమాణాలు పాటించబడుతున్నాయో లేదో గట్టిగా పర్యవేక్షించడం లేదన్న ఫిర్యాదులు వచ్చాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడినప్పటికీ, విలువై న వస్తువులు గల బ్యాగ్‌లను, సూట్‌కేసులను కోల్పోయా మని ప్రయాణీకులు వాపోతున్నారు. ఈ ప్రమాదంపై విచారణ జరుగుతున్న దృష్ట్యా కారణాలపై ఊహాగానాలే తప్ప, వాస్తవాలు ఇంకా వెలుగులోకి రాలేదు. ఈ ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని ప్రాథమికంగా అందిన సమాచారం. ఒక ప్రయాణీకుడు విసిరేసి నసిగెరెట్‌ పీక కారణమని మరో కథనం. ఏమైనా దారుణం జరిగిపోయింది. రైలు ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ గతంలో వేసిన కమిటీల సిఫార్సులేవీ అమలు జరగడం లేదు .

రైల్వేకు ప్రత్యేక బడ్జెట్‌ లేకపోవడం వల్ల ఈ శాఖలకు కేటాయింపుల్లోనూ కోత పడుతోంది. అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నామంటూ ప్రయాణీకుల వద్ద డబ్బు లాక్కొనే రైల్వే శాఖ అమలు జెెస్తోందని ప్రయాణీకులు వాపోతున్నారు. ముఖ్యంగా, బోగీల్లో కేటరింగ్‌ అవసరమే కానీ, బిస్కెట్‌ ప్యాకెట్ల పేరిట సిగెరెట్‌, గుట్కాలు, బీడీలు తదితర ధూమపాన వస్తువు లను విక్రయించేందుకు అనుమతిస్తున్నారు. మంటలు రేపే వస్తువులను బోగీల్లో తీసుకుని వెళ్ళరాదనే నిబంధ న ఉన్నప్పటికీ, ఆర్‌పీఎఫ్‌ పోలీసులు చూసీ చూడనట్టు ఊరుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రయాణీకులే వారికి ఆమ్యామ్యాలు ఇచ్చి గ్యాస్‌ సిలిండర్లు, కిరోసిన్‌ స్టవ్‌లు తీసుకుని వెళ్తున్నారు. హైలీ ఫ్లేమబుల్‌ ఆర్టికల్స్‌ బ్యాన్‌డ్‌ అని బోర్డులు మాత్రం తగిలిస్తుంటారు. ప్రయో జనం శూన్యం. కేవలం రైల్వే భద్రతాదళాలను మాత్రమే నిందించి ప్రయోజనం లేదు. ప్రయాణీకుల్లో సివిక్‌సెన్స్‌ రానురాను తగ్గిపోతోంది. గతంలో తమ ఇళ్ళల్లో వస్తువు లను ఏ విధంగా అయితే ప్రమాదాలకు దూరంగా, సురక్షితంగా భద్రపర్చుకుంటామో అదే రీతిలో ప్రయా ణాల్లో కూడా అవే ప్రమాణాలను పాటించాలనే ఇంగితం ప్రయాణీకుల్లో తగ్గిపోతోంది.

- Advertisement -

బాలాసోర్‌ జిల్లాలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు తాజా సమాచారం. కమిటీలు ఏర్పాటు చేయడం, వాటి నివేదికలను పట్టించుకోక పోవడం రైల్వే శాఖలో మామూలే. సిగ్నలింగ్‌ వ్యవస్థకు భారీ ఎత్తున నిధులు కేటాయించాలని గతంలో రాకేష్‌ కమిటీ సిఫార్సు చేసింది. కానీ, ఆ సిఫార్సు అమలు జరగ లేదు. పట్టాలను తరచూ మార్చకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. రైల్వేశాఖకు పూర్తి స్థాయి కేబినెట్‌ మంత్రి లేరు. అశ్విన్‌ వైష్ణవ్‌ రైల్వే శాఖతో పాటు మూడు శాఖలను నిర్వహిస్తు న్నారు. రైల్వేల్లో పర్యవేక్షణ తగ్గడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. రైలు ప్రమాదాలపై కేంద్రం దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తరాది ని కూడా ఇటీవల తరచుగా ప్రమాదాలు జరుగుతు న్నాయి. గతంలో రైల్వే శాఖ రైల్వే జోన్ల వారీగా భద్రతా కమిటీలను ఏర్పాటు చేసి తాజా పరిస్థితిని సమీక్షించేది. ప్రస్తుతం అలాంటి చర్యలు తీసుకుంటున్నట్టు లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement