Monday, April 29, 2024

Editorial – జయహో…. చంద్రయాన్ – 3

చంద్రునిపై పరిశోథనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్ర యాన్‌-3 విజయవంతంగా కక్ష్యలో ప్రవేశించడం ఇస్రో శాస్త్రవేత్తల అకుంఠిత దీక్షకు, పట్టువీడని లక్ష్యసాధనకు నిదర్శనం. అంతరిక్ష రంగంలో ఎన్నో ప్రయోగాలను చేస్తూ అగ్రరాజ్యాల సరసన స్థానం సంపాదించుకున్న ఇస్రో విజయాలు ఇప్పటికే ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకున్నాయి. చంద్రయావ్‌-3 ప్రయోగం కోసం దేశమంతటా ప్రజలు ఎంతో ఉచ్కంఠతో ఎదురు చూశారు. 2019లో చంద్రయాన్‌ ప్రయోగం విఫలం కావడంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదల ఇస్రోలో పనిచేసే ప్రతి ఒక్కరిలో కనిపించింది. ఇస్రో ఈ స్థాయికి ఎదగడానికి ఎంతో మంది శాస్త్రజ్ఞులు కృషి చేశారు. వారిలో ముఖ్యులైన సతీష్‌ ధావన్‌ పేరిట శ్రీహరికోటలో ఏర్పాటైన అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్‌-3ని ప్రయోగించారు. ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ని మోసుకుని ధావన్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చిమ్ముకుంటూ వాహక నౌక నింగిలోకి దూసుకునిపోయింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో డైరక్టర్‌ సోమనాథ్‌, ఆయన నేతృత్వంలోని శాస్త్రజ్ఞుల బృందాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అభినందించారు. భారత జాతికి గర్వకారణమని అన్నారు.

ఈ ప్రయోగంలో ఇది తొలి విజయం. అంతిమంగా జాబిల్లిపై ల్యాంర్‌, రోవర్‌తో కూడిన మాడ్యూల్‌ అడుగుపెట్టాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి దాదాపు నలభై రోజులు పడుతుంది. చంద్రయాన్‌ యాత్రపై తొలి ప్రకటన చేసింది మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయి. 2003లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లిdలో ఎర్రకోట బురుజుపై పతాకావిష్కరణ అనంతరం ఆయన ఇందుకు సంబంధించి ప్రకటన చేశారు. 2008లో చంద్రయాన్‌ తొలిప్రయోగం జరిగింది. మళ్ళీ 2019లో రెండో సారి ప్రయోగం జరిగింది.ఈ రెండు సార్లు ఎదురైన వైఫల్యాలను సరిదిద్దుకుని ఇప్పుడు మూడోసారి నింగిలో ప్రవేశించింది. ప్రయోగించిన కొద్ది సేపటికే రెండు దశలను పూర్తి చేసుకుని జాబిల్లి దిశగా ప్రయా ణించే కక్ష్యలోకి చేరింది.


మూడో దశ ముగియడంతో చంద్రుని దిశగా ప్రయాణం ప్రారంభించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం తో ఈ ప్రయోగం జరిగింది. ఇస్రోకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. మొదట్లో ఇస్రో నిర్వహించిన రాకెట్‌ ప్రయోగాలన్నీ రష్యా సహకారంతో జరిగాయి. తొలిసారి రష్యా సహకారంతో రష్యాలోని బైకనూర్‌ నుంచి రాకెట్‌ ప్రయోగం జరిగింది. తొలి ప్రధాని పం డిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ ఇస్రో ఏర్పాటుకూ, ఇస్రో ప్రయోగాలకూ ప్రోత్సాహం ఇచ్చారు. విక్రమ్‌ సారా భాయ్‌, సతీష్‌ ధావన్‌ వంటి శాస్త్రవేత్తలను ప్రోత్స హించారు. ఆ క్రమంలోనే మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ శాస్త్ర విజ్ఞానరంగం అభివృద్ధికి తన సేవలను అందించారు. ఇస్రో చైర్మన్‌లు కస్తూరి రంగన్‌, యూఆర్‌ రావు వంటి ఎందరో శాస్త్రజ్ఞులు ఇస్రో ప్రయోగాలను విజయవంతం చేసి అంతరిక్ష పరిశోధనారంగంలో భారత్‌ కీర్తి ప్రతిష్టలను ఎల్లడెలా వ్యాపింపజేశారు. సతీష్‌ ధావన్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ ఫ్లూయిడ్‌ డైనమిక్‌ రిసెర్చ్‌కి పితామహ ునిగా కీర్తి గడించారు. ఆయన పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌వంటి ఎన్నో పురస్కారాలు పొందారు. ఇలా నెహ్రూ ప్రోత్సాహంతో చిన్నమొక్కగా ప్రారం భమైన ఇస్రో ఇప్పుడు మహావటవృక్షం స్థాయికి ఎది గింది.

ఇస్రో బడ్జెట్‌ నాలుగు వందల కోట్ల లోపే. తక్కువ వ్యయంతో ఎక్కువ సామర్థ్యాన్ని సాధించిన అంతరిక్ష పరిశోధనా కేంద్రంగా ఇస్రో గణుతికెక్కింది. ఇస్రోలో శిక్షణ పొందిన ఎంతోమంది శాస్త్రజ్ఞులు అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారు. మొదట్లో ఇతర దేశాల సహకారంతో రాకెట్‌ ప్రయోగాలు జరిపిన ఇస్రో ఇప్పుడు ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయ వంతంగా ప్రయోగిస్తోంది. తక్కువ వ్యయంతో ప్రయోగాలు ఇస్రోకే సాధ్యమన్న పేరు గడించింది. అందుకే ఇతర దేశాల ఉపగ్రహాలను మన ఇస్రో అంతరిక్షంలోకి పంపుతోంది.

- Advertisement -


ఇంతవరకూ నార్వే, ఆల్జిdరియా, స్విట్జర్లాండ్‌, దక్షిణ కొరియా, ఇండోనేషియా, బెల్జియం తదితర దేశాల ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. రాకెట్‌ ఇంధనాన్ని మన ఆంధ్రప్రదేశ్‌లో తయారు చేసే పరిశ్రమ వృద్ది చెందింది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వెలిసిన స్టార్టప్‌లు రాకెట్‌ ప్రయోగానికి అవసరమైన పరికరాలు, విడిభాగాలను తయారు చేస్తున్నాయి. ఇస్రో సామర్ధ్యం దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మారు మోగుపోతోంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3ని జయీభవ.. విజయీభవ అని అన్ని దేశాలూ ప్రశంసిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement