Saturday, April 27, 2024

ఎడిటోరియల్ – ఒప్పందం – మ‌న సంగ‌తేంటి..

అమెరికాకి చెందిన బోయింగ్‌ విమానాల సంస్థతో ఎయిరిండియా కుదుర్చుకున్న ఒప్పందం అమెరికాలో ని 44 రాష్ట్రాల్లో పది లక్షలుపైగా కొత్త ఉద్యోగాలను సృష్టించనున్నది.అమెరికాలోనూ ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోతున్న తరుణంలో ఈ ఒప్పందం అమెరికాకు ఎంతో మేలు చేసేదే. అందుకే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్‌ చేసి ఆయనతో ఆనందాన్ని పంచుకున్నారు. నష్టాలతో నడుస్తున్న ఎయిరిండియాను కేంద్రప్రభుత్వం నడపలేక రతన్‌ టాటా నేతృత్వంలోని టాటా సంస్థకు విక్రయించి చేతులు దులుపుకున్న సంగతి తెలిసిందే. జార్జి బుష్‌ అమెరికా అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆనాటి భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో అణు ఒప్పందాన్ని కుదుర్చు కున్నప్పుడు కూడా అమెరికా ఇదే మాదిరిగా ఆనందా న్ని వ్యక్తం చేసింది. ఆనాటి అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైస్‌ చాలా భోళాగా ఈ ఒప్పందం వల్ల భారత్‌ కన్నా తమ దేశానికే ఎక్కువ లాభదాయకమని అన్నారు.

అణు రియాక్టర్ల తయారీ కర్మాగారాల్లో కొత్తగా కోట్లాది ఉద్యోగాలు సృష్టించబడతాయనీ, దాని వల్ల స్థానికంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. అయితే, అణు ఒప్పందానికీ, బోయిగ్‌ సంస్థతో కుదుర్చు కున్న ఒప్పందానికీ ఏమాత్రం సంబంధం లేదు కానీ, అమెరికాతో ఒప్పందం ఎప్పుడూ ఏకపక్షంగానే ఉం టుందని చెప్పేందుకే ఆ ప్రస్తావన. ఇప్పుడు కూడా అమెరికాలో పదిలక్షల ఉద్యోగాలు కొత్తగా లభించే అవకాశం ఉందని అమెరికాయే చెబుతోంది. ఈ ఒప్పం దంతో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు మరింత బలోపేతం కాగలవని బిడెన్‌ అన్నారు. ఈ ఒప్పందం విలువ 45.9 బిలియన్‌ డాలర్లు. ఈ ఒప్పందం గురించి మోడీ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మాక్రాన్‌తో నూ, బ్రిటిష్‌ ప్రధాని రిషి సునాక్‌తోనూ వర్చువల్‌ సమా వేశాలు నిర్వహించారు. ఈ ఒప్పందం వల్ల ఫ్రాన్స్‌, బ్రిటన్‌లకు కూడా ప్రయోజనం చేకూరనుంది.
టాటా గ్రూపు ఒప్పందంలో ఎయిర్‌బస్‌, బ్రిటన్‌కి చెందిన రోల్స్‌ రాయిస్‌ కూడా ఉంది. అంటే బోయింగ్‌ సంస్థతో టాటా గ్రూపు ఒప్పందం వల్ల అమెరికాతో పాటు ఫ్రాన్సూ, బ్రిట న్‌ కూడా లబ్ధి పొందనున్నాయి. అందువల్ల ఆ రెండు దేశాల అధినేతలు కూడా మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. బోయింగ్‌ విమాన సంస్థ అమెరికాది. ఎయిర్‌బస్‌ యూరప్‌ కంపెనీదే కానీ, దాంట్లో ప్రధాన వాటా ఫ్రాన్స్‌ ది. టాటా ఒప్పందంతో ఈమూడు దేశాలతో భారత్‌ సంబంధాలు మరింత మెరుగవుతాయని అంటున్నా రు. మంచిదే కానీ, భారత్‌లో ఉద్యోగాల సృష్టి కోసం ఈ మూడు దేశాల్లో ఒక్కటైనా మనకు సాయపడుతోందా అన్నప్రశ్న తలెత్తుతుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సమీకరణాలు మారిపోయాయి.
రష్యాతో తెగతెంపులు చేసుకోవాలని అమెరికా ఎన్నిసార్లు ఒత్తిడి తెచ్చిందో అందరికీ తెలిసిం దే. రష్యాతో మన దేశానికి దశాబ్దాలుగా మైత్రి ఉంది. అమెరికా మన దేశంతో ఏ ఒప్పందం చేసుకున్నా ఏదో ప్రయోజనం ఆశించి చేసుకుంటుందనేది జగద్విదితం. బోయింగ్‌ విమానాలు అవసరమే, కానీ, ఈ విమానాల ను టాటా కంపెనీకి చౌకగా ఏమీ విక్రయించడం లేదు. ఆ విషయం అలా ఉంచితే, అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షో భం సంభవించినప్పుడు ఈ మూడు దేశాలు మన దేశా నికి అండగా నిలవడం లేదు. అటువంటప్పుడు ఆ దేశాల కు మేలు చేకూర్చే ఒప్పందానికి మనం అంగీకరించడ మా అన్నప్రశ్న తలెత్తుతుంది. అయితే, దేశంలో ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోడీకి రాజకీయంగా తిరుగులేకపోవడం వల్ల ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా చెల్లుబాటు అవుతుందనేభావన అగ్రరాజ్యమైన అమెరికాకూ, దాని మిత్ర దేశాలకూ ఉన్న మాట నిజమే.
ఈ విమానాల వి డిభాగాల తయారీ యూనిట్లను భారత్‌ లో ఏర్పాటు చేసి స్థానికంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం ఈ ఒప్పందంలో ప్రధానాంశంగా చేర్చి ఉంటే బాగుండేది. విదేశీ పరిజ్ఞానం తో మన దేశంలో విడిభాగాలను తయారు చేయడానికి స్టార్ట్‌ అప్‌లు ఎన్నో వెలుస్తున్నాయి. బోయింగ్‌ విమానాల రెక్కలను తయా రు చేసే యూనిట్ల వల్ల తమ దేశంలో లక్షల మందికి ఉద్యో గాలు లభిస్తాయని అన్నారు. ఆ యూనిట్లు ఏవో మన దేశంలో ఏర్పాటు చేస్తే ఇక్కడ మన వారికి ఉపాధి లభి స్తుంది కదా! ప్రధానమంత్రి ఈ విషయంలో ఎందుకు షరతు విధించలేదన్న ప్రశ్న ప్రజల్లో ఏర్పడటం సహజ మే. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా విదేశీ సంస్థలను స్వాగతిం చడం ఇప్పటికే జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ బోయింగ్‌ విమాన సంస్థ విడిభాగాల యూనిట్లను భారత్‌లో తయారు చేసేందుకు వీలుగా ఒప్పందంలో భాగం కల్పించి ఉంటే ఉభయ తారకంగా ఉండేది. అయితే భారత్‌ నుంచి ఆర్డర్లు సంపా దించడమే లక్ష్యంగా ఈ మూడు దేశాలు వ్యవహరించ డంలో మన దేశం తగిన రీతిలో స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement