Friday, May 27, 2022

నేటి సంపాదకీయం – స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్ష…

కరోనా రెండవ దశ వైద్య నిపుణుల అంచనాలకు అతీతంగా విస్తరిస్తూ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో వచ్చే మూడు నాలుగు వారాలు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలనీ, సమూహాల్లో చేరకుండా ఇంటివద్దనే ఉంటూ కరోనాపై యుద్ధంలో విజయం సాధించేందుకు ప్రభుత్వానికి సహకరిం చాలని విజ్ఞప్తి చేశారు. కరోనా రెండవ దశలో మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది. నిన్న మొన్నటి వరకూ మన మధ్యనే ఉన్న వారు కరోనా కారణంగా ప్రాణాలను విడవడం బాధా కరమే. కరోనాని నియంత్రించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వా లు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అయినప్పటికీ, ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిట లాడుతున్నాయి.అయితే,విరోచనాలు. వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలున్నవారు మాత్రమే టెస్టింగ్‌కి రావాలని తెలంగాణ వైద్య శాఖ డైరక్టర్‌ సూచించా రు. అవసరం ఉన్నవారూ, లేనివారూ అంతా ఒకే సారి వచ్చి ఆస్పత్రులను రద్దీ చేయడంతో సిబ్బంది ఇబ్బందికి గురవుతున్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఒక డోస్‌ వేయించుకున్న వారివల్ల ఇతరులకు ఇబ్బందులేవీ ఉండవని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పండుగలు, పెళ్ళిళ్ళ సీజన్‌లలో జనం జాగ్రత్తలను మరింత ఎక్కువగా పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కరోనా వైద్యం తీసుకుంటున్న వారు ఎక్కడికీ కదలకుండా ఉండటమే మంచిదనీ, ఒకవేళ బయటకు వెళ్ళాల్సి వచ్చినా తమ మొబైల్‌ ఫోన్‌లు స్విచ్‌ ఆన్‌ చేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.కర్నాటకలోమూడు వేల మంది కరోనా సోకిన వారి జాడ తెలియకపోవడంతో వారి బంధుమిత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్‌ వ్యాప్తి వేళ రోగ లక్షణాలను బహిర్గతం చేసుకోవాలి. వ్యక్తిగతమై నవే అయినా, ఎవరో విని నవ్వుకుంటారనో, ఎగతాళి చేస్తారనో నామోషీ పడరాదు.చిన్న పామునైనా పెద్ద కర్రతోకొట్టాలన్న సామెత చందంగా రోగ లక్షణాలు కనిపించగానే వైద్యు లను సంప్రదించాలి. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌ మెంట్‌ ద్వారానే కరోనా నయమవుతుందని వైద్యనిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. టెస్టింగ్‌కి వెళ్ళిన వారు భౌతిక దూరాన్ని పాటించాలి. దగ్గుతున్నవారు మన పక్కనే కూర్చుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. బహి రంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం కరోనా వేళలోనే కాదు, మామూలు వేళల్లో కూడా వాంఛనీయం కాదు. పదిమందికి ఇబ్బంది కలిగించే రీతిలో వ్యవహరించరాదన్న వైద్యుల సూచనలను పాటించాలి. ఈ జాగ్రత్తల గురించిమార్గదర్శకాల రూపంలో వైద్య శాఖ ఎప్పటికప్పుడు ప్రకటనలు విడుదల చేస్తూనే ఉంది.కానీ, మనలో ఉన్న నిర్లిప్తతా భావం కారణంగా రోగాలను కోరి తెచ్చుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో కేసులసంఖ్య పెరగడంతో కొత్తగా 60 కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి తెలిపారు. అలాగే, తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 వేల పడకలను కేటాయించామని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పరిస్థితి తీవ్రతకు తగినట్టుగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా అసంతృప్తి వెల్లడి అవుతూనే ఉంది. కరోనా రెండవ దశను ఒక జాతీయ విపత్తుగా పరిగణించి ప్రతిఒక్కరూ ప్రభుత్వాలకు తమ వంతుసాయాన్ని అందించాలి. కరోనా సోక కుండా నియంత్రణ చర్యలను పాటించడమే మనం చేయగల సాయమని ప్రతిఒక్కరూ గుర్తించాలి. కరోనా తొలి దశలో అమెరికా యావత్‌ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అటువంటిది కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తి కావడం వల్ల మాస్క్‌లు లేకుండా జనం నిర్భయం గా తిరగొచ్చని సెంటర్‌ ఫర్‌డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ప్రకటన జారీ చేసింది. ప్రజలు నియంత్రణ పాటించడం వల్లనే కరోనా అదుపులోకివచ్చిందని ఆ కేంద్రం ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంది. అయినప్పటికీ కరోనా కేసులు పెరగడంతో పగటి పూట కూడా ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని ఆయా రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. అలాగే, న్యూజిలాండ్‌ తదితర దేశాల్లో కరోనా అదుపులోకి వచ్చింది. మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో స్వీయ నియంత్రణ వల్ల కరోనాను జయించాయి. కనుక కరోనాను శాశ్వతంగా పారద్రోలాలన్న వజ్ర సంకల్పంతో ప్రతిఒక్కరూ కృషి చేస్తే మన దేశంలో కూడా అసాధ్యమేదీ లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement