Sunday, May 5, 2024

ఆదిభిక్షువుని ఏది అడగాలి

”భగవంతుణ్ణి మనం ఏదైనా కోరితే దాన్నే తీరుస్తాడు. ఏదీ కోర కుండా నమస్కరిస్తే మనకు ఏది అవసరమో దాన్నిస్తాడు” అంటారు పెద్దవాళ్ళు. నిజమే! రెండోదే మంచిది.కానీ మనం సామాన్య మానవులం కనుక ఏ కోరికను కోరకుండా ఉండలేము. కను క ఏదో ఒకటి కోరుతూనే ఉంటాము. ఎవరి అవసరం వారిది. ఎవరి కోరిక వారిది. అందరమూ అన్ని సమయాలలోనూ కోరవలసిన కోరి కలు మూడు వున్నాయి. అవి ఏమిటంటే-
”అనాయేసేన మరణం, వినా దైన్యేన జీవనం!
దేహంతే తవ సాయుజ్యం, దేహమే పార్వతి పతే”
ఎటువంటి యాతనపడకుండా చాలా సులభంగా మరణించ డం, ఏవిధమైన దీనావస్థకు లోను కాకుండా గౌరవంగా జీవించడం, మరణించిన తరువాత నీలో ఐక్యమైపోవడం- ”పరమేశ్వరా! ఈ మూడు వరాలను నాకు ప్రసాదించు!” అని కోరుకోవాలి. మన శరీరానికి జరా మరణాలు- వ్యాధి, ముసలితనం, మరణం- చాలా స#హజమైన అనివార్యమైన లక్షణాలు. ఈ మూడు స్థితులలోనూ శరీరం యాతనకు గురికాక తప్పదు. ముసలితనం రాగానే శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటి పనిచేయకపోవడం, మల మూత్ర విసర్జనకు కూడా అవతలకు వెళ్లే శక్తిలేక మంచంలోనే కానివ్వటం. తాను ఇబ్బందిపడుతూ, ఇతరులను ఇబ్బంది పెట్టడం- ఈ శారీరిక కష్టాలేవీ లేకుండా ‘ఉర్వారుక మివ…’ బాగా పండిన దోస పండు తొడిమ నుంచి ఏవిధంగానైతే మృదువుగా ఊడిపోతుందో, ఆ విధంగానే ఈ శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోవాలి.. ఇది మొదటి కోరిక.
ప్రతి మనిషికి కనీస అవసరాలు మూడు. కడుపునిండా భోజనం, ఒంటినిండా వస్త్రం. తలదాచుకోవటానికి ఇల్లు . ఇవి ఎంత అవసరమై నవి అంటే- ఇతరులను యాచించి అయినా సమకూర్చు కొనవలసినవి. కనుక వాటికి లోటులేకుండా, ఇతరుల వద్దకు వెళ్లి ‘దే#హ’ అని యా చించే దుస్థితి లేకుండా గౌరవంగా బ్రతకాలి. ఇది రెండవ కోరిక.
ఇక చివరిది అత్యంత ముక్తి. దీనికి విడి పడటం అని అర్థం. శారీరిక బాధలు, మనోవేదనల నుండి, సమస్త లౌకిక బంధాల నుండి విము క్తులం కావాలి. ఆపై పరిస్థితి ఏమిటి? స్వర్గం వద్దు.
‘క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి’
సంపాదించుకొన్న పుణ్యాన్ని ఆ స్వర్గ లోకంలో అనుభవించటం పూర్తి కాగానే తిరిగి భూలోకంలో జన్మించవలసిందే అంటారు. పునర్జ న్మ లేనివిధంగా భగవంతునిలో ఐక్యమైపోవాలి. మనం ఏ సచ్చిదా నంద బ్రహ్మం నుంచి ఈ లోకానికి వచ్చామో, ఆ బ్రహ్మంలో మమైకమై పోవాలి. ఇదే సాయుజ్యం, సాలోక్యం, సామీప్యం, సారూప్యం, అను నాలుగు విధాలైన ముక్తులలో ఇది శ్రేష్ఠతమమైనది.- ఇది మూడో కోరిక.
దీని సారాంశము ఏమిటంటే బ్రతికినన్నాళ్ళు సంతోషంగా, గౌరవ ప్రదంగా బ్రతకాలి. ఆరోగ్యంతో ఆయుర్దాయాన్నంత టి నీ అనుభవించి హాయిగా మరణించి ఇష్టదైవంలో ఐక్యమైపోవాలి. అందరం ఆ భగ వంతుని కోరవలసిన ముచ్చ టైన మూడు కోరికలివే.

  • డా|| చదలవాడ హరిబాబు
    9849500354.
Advertisement

తాజా వార్తలు

Advertisement