Friday, May 3, 2024

ధర్మం మర్మం (ఆడియోతో..)

శ్రీమన్నారాయణుని అవతారాలలోని ఆంతర్యం
శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్ష: సహస్రపాత్” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి.

ఈరోజు వామనావతారం వి శేషాలపై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
వామనావతారం
శుక్రాచార్యుని దయతో, అతనిచ్చిన శక్తితో, బలి చక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించి మూడు లోకాలను పరిపాలి స్తున్నపుడు ఇంద్రుని తల్లి అదితి భర్త అయిన కశ్యప మహర్షి పయో వ్రతమును ఆచ రించి శ్రీమన్నారాయణుని ఉపాశించెను. స్వామి సాక్షాత్కరించి గురువు శుక్రాచార్యాడి దయతో విశ్వ విజేత అయిన బలి చక్రవర్తిని ఓడించాలంటే శుక్రాచార్యుని దయను తప్పించాలని అదితి కశ్యపులకు పుత్రునిగా వామనావతారంలో అవతరించాడు శ్రీమన్నారాయణుడు. వెంటనే ఉపనయనం చేసుకుని బలి యజ్ఞ వాటికకు భిక్షకు వచ్చి బలిని మూడు అడుగుల భూమిని భిక్షమడిగాడు వామనుడు. శుక్రాచార్యుడు వద్దం టున్నా బలి వామనునికి మూడు అడుగులు దానం చేయగా వామనుడు త్రివిక్రముడై తన అడుగులతో మూడు లోకాలు ఆక్రమించి త్రైలోక్య రాజ్యాన్ని ఇంద్రునికి ఇచ్చి బలి చక్రవర్తికి సుతలాధిపత్యాన్ని ప్రసాదించి అతనికి తానే ద్వారపాలకునిగా నిలచి రక్షించిన ధర్మకర్మయోగి వామనావతారం. శుక్రాచార్య అనుగ్రహాన్ని తొలగించిన సకల లోకాచార్యుడు వామనుడు. కావున తన దయతో బలిని సుతలాధిపతిని చేసి ధర్మ బద్ధుడైన వాడిని ఎవరూ బాధించ లేరు అని నిరూపించిన వాత్సల్య మూర్తి వామనావతారం.
శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement