Saturday, May 4, 2024

TTD NEWS : తిరుచానూరులో భక్తుల సౌకర్యార్ధం దీర్ఘకాలిక ప్రణాళికలు

తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే ఆకాశం ఉన్నందున వసతులు పెంచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఎఫ్ఎ అండ్ సీఈవో బాలాజితో కలిసి ఆయన తనిఖీలు నిర్వహించారు. యాగశాలలో నిరుపయోగంగా ఉన్న సామగ్రిని తొలగించడం వల్ల ప్రదక్షిణ చేయడానికి సౌకర్యంగా ఉందన్నారు. ప్రసాదాల పంపిణీ కేంద్రాల వద్ద క్యూలైన్లలో భక్తులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆలయంలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని అదనపు ఆరోగ్యాధికారికి సూచించారు. ఫ్రైడే గార్డెన్లో దిగుడు బావిని పరిశీలించి పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. బావిలోని ఊట నీరు ఆలయ అవసరాలకు ఉపయోగపడతాయేమో పరిశీలన జరపాలని అధికారులకు సూచించారు. అనంతరం పూలమాలల తయారీ ప్రాంతం, పిండి మర, విద్యుత్ గదిని పరిశీలించారు. ఈ ప్రదేశాలు భక్తుల అవసరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అమ్మవారి ఆలయ పుష్కరిణి సందర్శించి అక్కడ చేయాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. తోళప్ప గార్డెన్, వాహన మండపం వద్ద జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement