Thursday, May 2, 2024

నేటి రాశిఫ‌లాలు(19-04-2024)

మేషం : వారికి ఈరోజు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి తద్వారా లాభాన్ని పొందే అవకాశం కలదు. సత్పురుషుల సాంగత్యం పొంది, శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కలదు.

వృషభం : వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు, విద్యార్థులకు శారీరక శ్రమ అధికంగా ఉంటు-ంది. ఫలితం మాత్రం సామాన్యంగా ఉంటు-ంది. మనస్సు స్థిరత్వం కోల్పోయే అవకాశం కలదు.

మిధునం : వారు ఈరోజు సంతానపరమైన శుభవార్తలు వింటారు. విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు… సామాన్యంగా, లాభదాయకంగా ఉంటాయి.

కర్కాటకం : వారికి ఈరోజు మిత్రుల వలన, సహ ఉద్యోగ, వ్యాపారస్తుల వలన ఇబ్బందులు కలుగవచ్చు. జాగ్రత్త వహించడం మంచిది. వారి వల్ల ధననష్టం కలిగే అవకాశం ఉంది

సింహం : వారు ఈరోజు కుటు-ంబ, ధన వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. కొద్దిపాటి సమస్యలు రావచ్చు. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగును.

- Advertisement -

కన్య: వారికి ఈరోజు కుటు-ంబపరమైన చికాకులు, చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశం కలదు. అంతర్గత శత్రువుల వలన ఇబ్బందులు పడవలసి వస్తుంది. వాటిని అధిగమిస్తారు. జాగ్రత్త వహించడం మంచిది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగవచ్చు, శత్రుబాధలు కలుగవచ్చు

తుల : వారికి ఈరోజు సోదరుల వలన స్వల్ప లాభాలు కలుగును. ఆకస్మిక ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. సోదరుల వల్ల ఇబ్బందులు కూడా కలుగవచ్చు.

వృశ్చికం : వారికి ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉండును. తద్వారా లాభాన్ని పొందే అవకాశం కలదు. ఆర్ధికంగా సంతృప్తి చెందినా… చిన్నచిన్న వ్యయప్రయాసలుండును.

ధనస్సు : వారికి ఈరోజు విదేశ, ఉద్యోగ, విద్యా, వ్యాపార విషయాలలో సానుకూల పరిస్థితులు కలుగును. వృత్తి, వ్యాపారాలలో లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. మంచిపేరు సంపాదిస్తారు.

మకరం : ఈరోజు సంతాన ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగపరంగా సామాన్యంగా ఉంటు-ంది. కొత్త నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

కుంభం : వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు ఉండి, శారీరక శ్రమ అధికంగా ఉంటు-ంది. సోదరుల వలన ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగవచ్చు. విద్యార్థులకు సామాన్యంగా ఉంటు-ంది.

మీన : ఈరోజు సాధ్యమైనంతవరకు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. జోక్యం చేసుకుంటే, ఇబ్బందులు రావచ్చు. అనవసరమైన ఖర్చులు పెట్టే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement