Friday, April 26, 2024

భక్తుడి విశిష్టత

భగవంతుడిదీ భక్తుడిదీ విడదీయలేని బంధం. విడదీయగ రాని అను బంధం. అంతటి అన్యోన్య అవినాభావ సంబంధం ఇద్దరిదీ. ఒకరు ఉంటేనే మరొకరు. ఓ తత్త్వం ఉంటేనే మరొక తత్త్వం ఉండేది. సంబంధిత తర్కానికి తాత్త్వికతకు సార్ధకత చేకూరేది.
భగవంతుడు లేనిదే భక్తుడుండడు. భక్తితత్త్వం ఉండదు. భక్తుడు లేకపోతే భగవంతుడికి ఆకారం ఉండదు. సాకారం ఉండ దు. భక్తుడుంటేనే భగవంతుని దర్శనం స్పర్శనం అవసరం అయ్యే ది. ప్రత్యక్షమవటం, ప్రసన్నమవటం, అనుగ్ర#హంచటం, అనుభ వం కలిగించటం యిత్యాది విషయాలకు ప్రాముఖ్యత వచ్చేది.
భగవంతుడు ఉంటేనే భక్తుడికి పూర్ణత్వం వచ్చేది. పరిపూర్ణ త్వం నిలిచేది. మోక్షత్వం, అమరత్వం లభించేది. భక్తుడు భగ వంతుని కోసం తపిస్తాడు. తపన పడతాడు. భగవంతుడు తన భక్తుడి మీద నిండుగా అనుగ్రహం కురిపించేటందుకు, అనుక్షణం ఆరాటపడుతుంటాడు. భగవంతుడు భక్తుడు యిద్దరూ… ఒకరికి మరొకరు తోడుగా, నీడగా, జోడుగా, జోడీగా, ఉంటేనే భక్తి భగ వత్‌ తత్వాలు రెండూ ఉండేవి. భక్తికో విధం, పధం, విధానం, మా ర్గం ఉండేది. భగవంతుడికి ఓ రూపం, స్వరూపం, గుణం, నామం ఉండేది. సామీప్యత ఉండేది. సారూప్యత, సాయుజ్యం ఉండేది. అంతటి అవినాభావ అనుబంధం భగవంతు డుది భక్తుడిది.
అయితే భగవంతుడు భక్తుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? ఎవరు శక్తివంతుడు? ఎవరి చేతిలో ఎవరు బందీ. ఈ సందేహాలు స#హజంగా కలిగేవే. ఆధ్యాత్మిక తత్త్విక చింతనను పురికొల్పేవే.
ఇలాంటి సందేహాలే ఓసారి ఓ కొంటె శిష్యుడికి కలిగాయి. సందేహాలు రావడమే ఆలస్యం, సందేహ నివృత్తి కోసం తిన్నగా గురువుగారిని ఆశ్రయించాడు. ”భగవంతుడు భక్తుడు వీళ్ళిద్దరి లో ఎవరు గొప్ప? ఎవరి కన్న ఎవరు ఎక్కువ? ఎవరు ఎవరికి జవా బుదారీ?” అని గురువుని సూటిగా అడిగాడు.
శిష్యుడి సందేహాలు విన్న గురువు ఓ నవ్వు నవ్వారు. ఆ చిరు నవ్వుతోనే శిష్యుణ్ణి గురువు యిలా అడిగారు. ”పంచభూతాలు ఉన్నాయి కదా! అందులో ఏది గొప్పది?” అని. ”నీరు మూడొంతు లు ఉంటే భూమి ఒక వంతే ఉంది కదా స్వామి. కాబట్టి నీరే గొప్ప ది” అని చెప్పాడు శిష్యుడు. ”అయితే అంత గొప్పది అయిన నీటిని అగస్త్యుడు ఒక్క గుక్కలో ఔపోసన పట్టేసాడు. మరి నీరు గొప్ప దా? అగస్త్యుడు గొప్పవాడా?” అనడిగారు గురువు.
”గొప్పదైన నీటిని ఔపోసన పట్టేసిన అగస్త్యుడు గొప్పవాడు” అని సమాధాన మిచ్చాడు శిష్యుడు. ”ఆహా! అలాగా. అంత గొప్ప వాడైన అగస్త్యుడు ఆకాశంలో ఉంటాడు కదా? ఆకాశం గొప్ప దా? అగస్త్యుడు గొప్పవాడా?” అని మరో ప్రశ్న వేసారు గురువు. ”గొప్ప వాడైన అగస్త్యుని నివాసం ఆకాశం కాబట్టి, ఆకాశమే గొప్పది” అనేది శిష్యుడి సమాధానం. ”అం తటి విశిష్టమైన ఆకాశాన్ని, భగవంతు డు వామన రూపంలో ఒక్క పాదంతో ఆక్ర మించేసాడు. మరి ఆకాశం గొప్పదా? భగవం తుని పాదం గొప్పదా?” అని ప్రశ్నించారు గురువు. ”భగవంతుని పాదమే గొప్పదన్నా”డు శిష్యుడు. ”భగ వంతుని పాదమే గొప్పది అయినప్పుడు, భగవంతుడు ఎంతటి గొప్పవాడై ఉండాలి” అన్నారు గురువు.
”అవును స్వామీ! భగవంతుడు నిజంగా చాలా గొప్ప వాడు” అన్నాడు శిష్యుడు. అప్పుడు గురువుగారు శిష్యుడితో యిలా అన్నారు. ”చూడు నాయనా! అంత గొప్పవాడైన భగ వంతుడు భక్తుడి #హృదయంలో ఉంటాడు కదా! అప్పుడు భగ వంతుడు గొప్పవాడా? భక్తుడు గొప్పవాడా?” అని మళ్ళీ ప్రశ్నిం చారు గురువు. ”భగవంతుడు భక్తుని హృదయంలో బందీగా ఉంటాడు కాబట్టి భక్తుడే గొప్పవాడు” చెప్పాడు శిష్యుడు.
ఇదీ భక్తుడి విశిష్టతని చమత్కారంతో చెప్పే కథ!
భగవంతుడ్ని మెప్పేంచేది, బంధించేది, దక్కేలా చేసేది భక్తి. శక్తివంతమైన భక్తి కోసం తపించి సాధన చేయాలి. శోధించి అలాంటి భక్తితత్వాన్ని సంపాదించి, అనుభవంలోకి తెచ్చు బకోవాలి. ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రులం కావాలి.
– రమాప్రసాద్‌ ఆదిభట్ల, 93480 06669

Advertisement

తాజా వార్తలు

Advertisement