Monday, October 7, 2024

Karnataka – అయిదు ఉచిత హామీలు జులై నుంచి అమ‌లు..

బెంగుళూరు – కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ ప్రకటించిన ఐదు ఉచిత హామీల అమలుకు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చింది సిద్ధరామయ్య కేబినెట్​. కుల, మత బేధాలు లేకుండా ఉచిత హామీలను అమలు చేస్తామని శుక్రవారం ప్రకటించారు ముఖ్యమంత్రి. నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్, మహిళలకు రూ.2,000 ఆర్థిక భృతి వంటి పథకాలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేస్తామని సిద్ధరామయ్య తెలిపారు.

కర్ణాటకలో కాంగ్రెస్​ ఘన విజయానికి దోహదం చేసిన ఐదు ఉచిత హామీల అమలు జులై 1 నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు.. గృహ జ్యోతి పథకం ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచితంగా ఇస్తామ‌న్నారు.. అయితే . జులై వరకు కరెంట్​ బిల్లులు ప్రజలు చెల్లించాల్సిందేనని తెలిపారు. అన్న భాగ్య పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల బియ్యం ఇస్తామ‌ని, ‘శక్తి’ పథకం కింద కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో ఆర్డినరీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపారు. అలాగే ‘యువ నిధి’ పథకం కింద నిరుద్యోగ పట్టభద్రులకు రూ.3 వేలు.. 2022-23లో పాసై నిరుద్యోగులుగా ఉన్న డిప్లొమా విద్యార్థులకు రూ.1,500.. 24 నెలల పాటు అందజేస్తామని సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ ఉచిత హామీల అమ‌లుకు ఏటా రూ.50 వేల కోట్లు ఖ‌ర్చుఅవుతాయ‌ని భావిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement